చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోండి

- మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

స‌భా సాంప్ర‌దాయాలు పాటించ‌ని స‌భ్యులు ఎవ‌రైనా చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే. సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వ‌ర్తించ‌కుండా ప్ర‌తిప‌క్ష స‌భ్యులు అడ్డుకున్నారు. పైగా చంద్ర‌బాబు గేట్ 2 నుంచి రాకూడ‌దు. ర్యాలీగా వ‌చ్చి దారిమ్మంటే వారు ఏం చేయ‌గ‌ల‌రు. స‌భ్యుల‌ను గుర్తించి ఒక్కొక్క‌రిగా పంపించాల్సిన బాధ్య‌త సెక్యూరిటీ సిబ్బందిదే. వారంతా మ‌న భ‌ద్ర‌త కోస‌మే ప‌నిచేస్తున్నారు. ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం గ‌లాటా సృష్టించడం, స‌భ‌ను అడ్డుకోవ‌డం, మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపించాల‌నే ఉద్దేశ్యంతోనే ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌భ‌ను సజావుగా న‌డివాల‌నే ఉద్దేశ్యం ఎక్కడా వారిలో క‌నిపించ‌డం లేదు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల్సింగా స‌భాప‌తిగా మీకే వ‌దిలేస్తున్నాం. అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటార‌ని ఆశిస్తున్నాం. 

Read Also: చంద్ర‌బాబు ప్ర‌భుత్వ ఉద్యోగిని బాస్ట‌డ్ అని తిట్ట‌డం ఏం సంస్కారం

Back to Top