చంద్ర‌బాబు ప్ర‌భుత్వ ఉద్యోగిని బాస్ట‌డ్ అని తిట్ట‌డం ఏం సంస్కారం

-  ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి

చంద్ర‌బాబునాయుడు ఎంత దారుణంగా ప్ర‌వ‌ర్తించారో ఈ వీడియోనే నిద‌ర్శ‌నం. నిజానికి ఆయ‌న ప్ర‌వేశించాల్సిన గేటు కూడా అది కాదు. పైగా ఒక ర్యాలీలాగా బ్లాక్ క్యాట్ క‌మెండాల‌తో అంత భారీగా వ‌చ్చిన‌ప్పుడు ఎవ‌ర్ని అనుమ‌తించాలో వారికి క‌ష్ట‌మైంది. ఒక్కొక్క‌ర్ని చూసి లోప‌లికి పంపాల్సిన బాధ్య‌త వారిది. ఆ ప‌నే వారు చేశారు. కానీ అందుకు ప్ర‌తిప‌క్ష స‌భ్యులు స‌హ‌క‌రించ‌లేదు. త‌న విధులు నిర్వర్తిస్తున్న ఒక ప్ర‌భుత్వ ఉద్యోగిని బాస్ట‌ర్డ్ అని తిట్ట‌డం సంస్కారమా. వీడియో చూస్తే ఎవ‌రు ఎవ‌రి మీద దౌర్జ‌న్యం చేస్తున్నారో తెలుస్తోంది. చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ అధికారి గొంతు ప‌ట్టుకుని యూజ్‌లెస్ ఫెలో అని తిడ‌తాడా..? ఉద్యోగులకు ప్ర‌తి స‌భ్యుడిని త‌నిఖీ చేసి పంపించాల్సిన అధికారం, బాధ్య‌త రెండూ ఉంటాయి. వారి ఉద్యోగ ధ‌ర్మం వారు న‌డుచుకున్నారు.

Read Also: మొదటి నుంచి టీడీపీ తీరు ఇంతే..

Back to Top