అసెంబ్లీ: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాను చీఫ్ మార్షల్‌గా పనిచేశానని, వైయస్‌ఆర్ ఉన్నంత వరకు చంద్రబాబు, టీడీపీ సభ్యులు కామ్‌గా ఉన్నారని, ఆయన మరణాంతరం వీరి ఆగడాలు మితిమీరిపోయాయని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు. భద్రత కోసం ఉన్న చీఫ్ మార్షల్, మార్షల్స్ గొంతు నులిమి టీడీపీ సభ్యులు చంపేయబోయారని, తక్షణమే దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆర్థర్ ఏం మాట్లాడారంటే.. పోలీస్ డిపార్టుమెంట్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారి చీఫ్ మార్షల్‌గా విధి ధర్మాలను నిర్వర్తిస్తారు. సభలోకి ఎవరూ ప్లకార్డులు తీసుకురాకూడదు. గుంపుగా రాకూడదు. అసెంబ్లీ ఆవరణలో పదిమందితో మీటింగ్ పెట్టకూడదనే వంటి రూల్స్ బుక్‌లో ఉన్నాయి. స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్స్ విధులు నిర్వహిస్తారు. చీఫ్ మార్షల్ అంటే టీడీపీ సభ్యులకు బంట్రోతు మాదిరిగా అనిపిస్తారు. కానీ వారు ఒక పోలీస్ డిపార్టుమెంట్ నుంచి డిప్యుటేషన్‌లో డీఎస్పీ అధికారి ఉంటారని తెలుసో లేదో..నిన్న తెలుగుదేశం సభ్యులు చీఫ్ మార్షల్ వ్యవస్థను చేతుల్లోకి తీసుకొని వారి గొంతును పట్టుకొని నలుముతున్నారు. టీడీపీ సభ్యుల తీరు వీళ్లు ఇప్పడే కాదు.. హైదరాబాద్‌లో అసెంబ్లీ ఉండగా.. దివంగత మహానేత వైయస్‌ఆర్ నన్ను చీఫ్ మార్షల్‌గా నియమించారు. వైయస్‌ఆర్ ఉన్నంత వరకు కామ్‌గా ఉన్నారు. ఆయన మరణం తరువాత వీరి ఆగడాలు మితిమీరిపోయాయి. లాబీల్లో అల్లర్లు చేయడం, లోపల తలుపులు పెట్టుకొని మమ్మల్ని రాత్రంత జాగరణ చేయించేవారు. బాత్‌రూంలలో దాక్కునేవాళ్లం, వీళ్లు బాత్‌రూంకు వచ్చినప్పుడు బయటకు వచ్చి సభ్యులను బయటకు పంపించేవాళ్లం. మొదటి నుంచి వీరి ఆగడాలు పెట్రేగిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒకటి చేయాలి.. ఎవరి మీదైనా దాడి చేసి అనుకూలంగా మల్చుకోవాలనే నినాదం టీడీపీతో తీరు ఉంది. చీఫ్ మార్షల్ మమ్మల్ని చంపేశారన్నట్లుగా మాట్లాడారు. వీడియోలు, ఫొటో క్లిప్పింగులు చూసినా.. టీడీపీ సభ్యులే మార్షల్స్‌పై దాడి చేశారు కానీ, అక్కడ మార్షల్స్, చీఫ్ మార్షల్స్ ఎలాంటి దాడి చేయలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా.. రూల్స్‌కు వ్యతిరేకంగా ఏ పని మార్షల్స్ చేయరు. స్పీకర్ ఆదేశాల మేరకు విధులు నిర్వర్తిస్తారు. మార్షల్స్‌ను గొంతునులిమి చంపడానికి ప్రయత్నించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి జరిగినప్పుడు చంద్రబాబు, సభ్యులు చీఫ్ మార్షల్స్‌గా నన్ను, స్పీకర్‌గా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని ఇష్టానుసారంగా దూషించారు. స్పీకర్ వారి చేత సారీ చెప్పించారు. ఈ రోజు కూడా చీఫ్ మార్షల్, మార్షల్స్‌ను రక్షించాలంటే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. Read Also: క్షమాపణ చెబితే హుందాగా ఉంటుంది