పిన్నెళ్లిని చంపేసే ప్రయత్నం చేశారు

రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేసేందుకు చంద్రబాబు కుట్ర

పిన్నెళ్లిపై దాడి వెనుక కర్త, కర్మ, క్రియ చంద్రబాబే

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖ: రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. ప్రభుత్వ విప్‌ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ గుండాల దాడిని అమర్‌నాథ్‌ తీవ్రంగా ఖండించారు. పిన్నెళ్లిని చంపేసే ప్రయత్నం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కావాలనే పక్కా ప్లాన్‌తో దాడి చేశారని పేర్కొన్నారు. దీని వెనుక కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతల సమస్య సృష్టించాలన్నదే చంద్రబాబు కుట్ర అన్నారు. చంద్రబాబుకు డబ్బు తప్ప ఏమీ అవసరం లేదన్నారు.

Back to Top