ప్రజా వ్యతిరేక విధానాలకు అంతిమంగా ఓటమి తప్పదు

రాజధానిపై చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు

గత ఐదేల్లు నిస్పృహలో  ఉన్న ప్రలు గత ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించారు

బాబు నిర్ణయాలతో వెనుకబడ్డ ప్రాంతాల వారికి కడుపు మండదా?

గత ప్రభుత్వం చేసిన తప్పులను సవరించడం ప్రస్తుత ప్రభుత్వ విధి

ప్రజలకు ఆశాజ్యోతిగా సీఎం వైయస్‌ జగన్ నిలిచారు

అన్నింటా అభివృద్ధి అంటే మీకెందుకు ఉలుకు?

ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు

అసెంబ్లీ: ప్రజా వ్యతిరేక విధానాలకు అంతిమంగా ఓటమి తప్పదని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని ఆయన అభినందించారు. వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. 
ఈ బిల్లుల ను స్వాగిస్తున్నాను. నిరాశలో ఉన్నటువంటి వారికి, రాష్ట్ర పరిస్థితులు తెలిసిన ఒక పౌరుడు ఎవరైనా నిష్పహలోకి వెళ్తాడు. ప్రజాస్వామ్య దేశం కాబట్టి..తరువాత వచ్చిన ప్రభుత్వం ఒక చట్టాన్ని రద్దు చేసి, మరో చట్టాన్ని తెచ్చిందని ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఏదైనా చేయాలి. ఇక్కడ బిల్డింగ్‌లు ఉన్నాయని చెప్పడం కాదు..రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉందా? లేదా అన్నది ప్రధానం. రాష్ట్ర ప్రజలందరి అభివృద్ధికి అవసరమైన నిర్ణయం తీసుకోవాలి. అందుకే ఇది ఒక చరిత్రాత్మక బిల్లు అయ్యింది. 2014లో ఏర్పడిన ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. అందులో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కింది. ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదు. మాకు ప్రభుత్వం ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్లు చేస్తూ ముందుకు వెళ్లింది. రాజకీయ పార్టీలతో చర్చించలేదు. విభజన ఏ చట్టం కింద జరిగిందో, సెక్షన్‌5, 6లో జరిగినటువంటి అంశాలపై ఓ కమిటీ వస్తే దాన్ని పట్టించుకోలేదు. రాజధాని కోసం కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికలు పక్కనపెట్టారు. కమిటీ ఎక్కడా తిరుగకముందే ఆ నాటి సీఎం వెల్లడించారు. రాజ్యాంగం చెప్పింది అవసరం లేకుండా, సుప్రీం కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా, రాజకీయ పార్టీలను లెక్క చేయకుండా అడ్డగోలుగా రాజధాని ప్రకటన చేశారు. మీడియాను అనుకూలంగా ఉపయోగించుకున్నారు. ఇది నైతికత అనిపించుకోదు. ఇన్నీ అనార్థాలకు కారణం ఒక బిజినేస్‌ మోడల్‌ను ఆ రోజు చంద్రబాబు ఎంపిక చేయడమే. దీని వల్ల ప్రమాదం ఏంటంటే..ఇన్ని వ్యవస్థలను అధిగమించినా..ఐదేళ్ల తరువాత వచ్చిన ఎన్నికల్లో నిస్సాహయంగా ఉన్న ప్రజలు ఓట్లతో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టారు. ప్రజాస్వామ్యంలో పౌరులందరికీ ఏ ప్రభుత్వమైన అడ్డగోలుగా వ్యవహరిస్తే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఓటర్ల చేతుల్లోనే అస్త్రం ఉంది. సీఎం వైయస్‌ జగన్‌ను ఎందుకు అభినందిస్తున్నానంటే.. ఇదే రాజధానిని కొనసాగించి ఉంటే ..ఆయనకు ఇచ్చిన తీర్పుకు విలువేముంది? ఇన్ని నష్టాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు తుక్కుతుక్కగా ఓడిస్తే..మళ్లీ అలాంటి నిర్ణయమే ఈ నాటి ప్రభుత్వం కూడా అవలంభిస్తే పౌరుడు నిరుత్సాహపడుతాడు. ఈ వ్యవస్థలో చెక్కు లేదు అని నిరుత్సాహ పడుతాడు. అందుకే ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఇదేం చిన్న విషయం కాదు. రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఏమిటి? 38, 39లో ఏముందో తెలియదా?. చంద్రబాబు నిర్ణయం తీసుకునే సమయంలో ఎవరికి చెప్పారు. వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల మధ్య అంతరాలు, తారతమ్యాలు తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. రాజ్యాంగానికి చంద్రబాబు తూట్లు పొడిచారు. వెనుకబడిన ప్రాంతం ఏవిధంగా అభివృద్ధి చెందుతుంది. ఆర్టికల్‌ 39/2లో ఏం చేయకూడదో కూడా చెప్పారు. రాజ్యాంగ పరిధిలో వచ్చిన కమిటీని అధిగమించారు. ఎన్నికల్లో మరో ప్రభుత్వాన్ని ప్రజలు ఆహ్వానించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ సరైన నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రబాబు చేసింది కొనసాగిస్తే..మళ్లీ ఉద్యమం మొదలవుతుంది. ప్రత్యేక రాష్ట్రం కావాలని మరో పోరాటం వచ్చేది. చంద్రబాబు చెప్పినదానికే కట్టుబడి లేరు. సీఎం వైయస్‌ జగన్‌ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆస్తిపోతున్న వారికి బాధ ఉంటుంది. అంతమాత్రం చేత బలహీనుల వాయిస్‌ చిన్నది కాదు. వారిని విస్మరిస్తే..ప్రజాస్వామ్యంలో ఆఖరి అస్త్రం మళ్లీ ఉపయోగిస్తారు. ఈ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. గడిచిన 75 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆశాజ్యోతిగా సీఎం వైయస్‌ జగన్‌  ఈ రోజు మిగిలారు. ముందు అభివృద్ధి చెందిన వారు వెనుకబడిన ప్రజల ప్రయోజనాలను కబలిస్తారు. రాష్ట్రంలో ఇదే జరిగింది. సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగడం తప్పని అనను. అమరావతి ప్రాంతంలో వారి ఆస్తులు వారి చేతుల్లో లేకుండా పోయాయి. అభివృద్ధి ఫలాలు పొందుతున్నారు.  భూములన్నీ మరొకరి చేతుల్లోకి వెళ్లాయి. రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తూ మళ్లీ దబాయిస్తున్నారు. మాలాంటి ప్రాంతాల్లో ఉన్న పనులు ఎంత ఆలస్యం అవుతుందో చూస్తున్నాం. వంశధార ప్రాజెక్టు 1956లో పునాది వేస్తే..70 సంవత్సరాల తరువాత కూడా పూర్తి కాలేదు. మూడు తరాలు మారాయి. కేవలం రూ.2 వేల కోట్ల ప్రాజెక్టు ఇంత ఆలస్యం అవుతుంది. రాయలసీమ, మిగతా జిల్లాల్లో రాజధాని వంటి అవకాశం వస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. జోలె ఎందుకు పట్టుకుంటున్నారు. ఆ ప్రాంతాలు బాగు పడటం మీరు చూడరా? అన్యాయం జరిగినట్లు చెబుతున్నారు. ఇది ఎవరు చేసిన అన్యాయం. ఒకప్పుడు నిస్సహయంగా ఉండే ప్రజలు మన ఖర్మ అనుకునేవారు. స్పందించినా చేయకుంటే సర్దుకున్నారు. పెరుగుతున్న చైతన్యంతో ప్రజల దోరణి మారింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం  వల్ల మేలు జరుగుతుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. కమిటీ రిపోర్టులను బోగి మంటల్లో కాల్చేశారట. ఆ ప్రాంతాల మనోగతాన్ని కాల్చేస్తారా? వారు చేసిన తప్పేంటి?. మీ అభిప్రాయాలు కొనసాగితే మేమంతా మంటల్లో తగలబడాల్సిందే. మీరు చెప్పిన మాటలేంటి? ప్రైవేట్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. వాళ్లు అడిగిన వాళ్లంతా చేసేందుకు చంద్రబాబు పని చేశారు. ఆ అగ్రిమెంట్‌ పూర్తి అయింటే మనమంతా కూడా మంటల్లో పడాల్సి వచ్చేది. వైయస్‌ జగన్‌ రూపంలో మనకు విముక్తి కలిగింది. రాష్ట్ర ప్రజలకు రాజధాని ఒక బూతంలా మారేది. సింగపూర్‌ పార్లమెంట్‌లో లెనిన్‌ పెరోరా అనే నాన్‌ పార్లమెంట్‌ సభ్యుడు ఒక ప్రశ్న అడిగారు. మంత్రి ఈశ్వరన్‌ చెప్పాడు..2014లో అమరావతికి మాస్టర్‌ ప్లాన్‌ ఇచ్చేందుకు అసైండర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ స్విస్‌ చాలెంజ్‌ పద్దతిలో ఒప్పందం చేసుకుందని ఆ దేశ మంత్రి వివరణ ఇచ్చారు. ఇలాంటివి చేయవద్దని సుప్రీం కోర్టు చెప్పినా చంద్రబాబు వినలేదు. రాజధాని నిర్మాణం సింగపూర్‌ కంపెనీలు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. జీ టూ జీ అంటూ చంద్రబాబు మభ్యపెట్టారు. అందుకే సీఎం వైయస్ జగన్‌ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటున్నారు. శ్రీకృష్ణ కమిటీ నిర్ణయాలను లెక్కలోకి తీసుకున్నారు. దేశంలో వన్‌ ఆఫ్‌ 70 చట్టం వచ్చింది. ఈ చట్టం తీసేస్తే ఎవరు అభివృద్ధి కనిపిస్తుంది. గిరిజనుల అనాగరితక అలాగే ఉంటుంది. అందుకే వన్‌ ఆఫ్‌ 70 ప్రాంతాలు రక్షించబడ్డాయి. పాలకుడు అనే వాడు ఇలాంటి ఆలోచనతో ఉన్నారు. చంద్రబాబుకు అన్నీ తెలిసే చేశాడు. మహమ్మద్‌ జిన్నా అప్పుడే చెప్పాడు..పాలకుడు కులాలు, మతాలు చూడకూడదు అని చెప్పాడు. అందుకే సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలు సమర్ధిస్తున్నాను. రాజ్యాంగబద్ధమైన నిర్ణయాన్ని గౌరవంగా అంగీకరించాలి. దబాయించడం, వ్యతిరేకించడం సరికాదు. దూరం అనే విషయాన్ని ప్రాతిపాదికగా తీసుకోకూడదని అన్ని కమిటీలు చెబుతున్నాయి. అన్ని రాజధానులు మారుమూలప్రాంతాల్లో ఉన్నాయి. విశాఖ అన్ని విధాల అభివృద్ధి చెందింది. రాష్ట్రంలోని పెద్ద నగరం విశాఖనే. విశాఖ ప్రాంతానికి ఎవరు వచ్చినా అక్కడి ప్రజలు ఆదరిస్తున్నారు. మా ప్రాంతం నుంచి వలస వెళ్తే కూలీగానే వస్తున్నారు. ఏమిటీ వ్యత్యాసం. ఇది తప్పుకదా? . మా ఆవేదన అర్థం చేసుకునే నాయకుడు ఉన్నారని ధైర్యంగా ఉన్నాం. దమ్ముంటే అచ్చెన్నాయుడు రాజీనామా చేసి మళ్లీ గెలవండి. సెంటిమెంట్‌ రాష్ట్రమంతా ఉందని నమ్మితే రాజీనామా చేయండి. ఎన్ని సీట్లు గెలుస్తారో చూస్తాం. దాబయిస్తే ఎవరూ భయపడరు. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా తీసుకున్న నిర్ణయం ఆ ప్రాంత ప్రజల ఆవేదనను తీర్చింది. అలాగే రాయలసీమ ప్రాంత ప్రజలు కూడా భావిస్తున్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. అన్ని ప్రాంతాల మనోభావాలను సీఎం వైయస్‌ జగన్‌ అర్థం చేసుకున్నారు. రానున్న కాలంలో మంచి ఫలితాలు వస్తాయని, ఈ రెండు బిల్లులను సమర్ధిస్తున్నాను. 

తాజా వీడియోలు

Back to Top