చంద్రబాబు హయాంలో ఒక్కటైనా తెలుగు మీడియం స్కూల్‌ పెట్టారా? 

ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
 

అసెంబ్లీ: చంద్రబాబు హయాంలో ఒక్కటైనా తెలుగు మీడియం స్కూల్‌కు అనుమతి ఇచ్చారా అని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు వచ్చి రాని ఇంగ్లీష్‌ మాట్లాడి తెలంగాణలో మన రాష్ట్ర పరువు పోగొట్టారని విమర్శించారు. అసెంబ్లీలో చెవిరెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ..తమ పిల్లలకు కూడా తెలుగు మీడియం చదివారని చెప్పారు. ఎంఏ తరువాత పీహెచ్‌డీ కోర్సు చేద్దామని పరీక్ష రాశాను. క్వాలీఫై అయ్యాను. మూడేళ్లలో ఈ కోర్స్‌ పూర్తి చేయాలి. పీహెచ్‌డీ కంటే ముందుగా ఫ్రీ పీహెచ్‌డీ పరీక్ష పెడుతారు. ఈ పరీక్షలో వంద మార్కులు ఉంటాయి. ఐదు ప్రశ్నలు రాయాలి. నేను తెలుగులో పరీక్ష రాస్తే..టీడీపీ నేతలు ఇతను తెలుగులో పరీక్షలు ఎలా రాస్తారని ధర్నాలు చేశారు. కోర్టుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం చదవాను. ఒక్కసారిగా ఇంగ్లీష్‌ మీడియంలో పరీక్ష రాయాలంటే టెక్నికల్‌గా ఇబ్బంది పడ్డాను. చివరకు కోచింగ్‌కు వెళ్లి వచ్చి రాని ఇంగ్లీష్‌ రాసి క్వాలీఫై అయ్యాను. ఆ రోజు తెలుగు విద్యార్థి విభాగం చాలా గోడవ చేసింది. ఈ రోజు చంద్రబాబును ఒక్కటి అడుగుతున్నాను. తన హయాంలో నారాయణను మంత్రిని చేశారు.ఆయన వియ్యకుండికి విద్యాశాఖ మంత్రిని చేశారు. కొన్ని వందల స్కూళ్లకు పర్మిషన్‌ ఇచ్చారు. ఆ రోజు తెలుగు మీడియం కోసం పర్మిషన్‌ ఇవ్వమని బుచ్చయ్య చౌదరి కోరారా. ఓటుకు కోట్లు కేసులో పట్టుబడిన తరువాత మా వాళ్లు బ్రీఫ్డ్‌మీ అని ఇంగ్లీష్‌లో మాట్లాడారు. ఆ రోజు కేటీఆర్‌ ఇంత దరిద్ర్యమైన ఇంగ్లీష్‌ మాట్లాడేది ఒక్క చంద్రబాబు ఒక్కరే అన్నారు. చంద్రబాబు వచ్చిరాని ఇంగ్లీష్‌ మాట్లాడి మన రాష్ట్ర పరువు పొగొట్టారు. మన పిల్లలు ఇంగ్లీష్‌ చదవాలంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు. పిల్లల భవిష్యత్‌తో చెలగాటమాడొద్దు.

Read Also: సోలార్ పార్కుకు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయండి

Back to Top