సోలార్ పార్కుకు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయండి

కాటసాని రాం భూపాలరెడ్డి
 

సోలార్ పార్క్ కు భూములిచ్చిన రైతుల సమస్యపై విద్యుత్ శాఖా మంత్రి బాలినేని గారిని ప్రశ్నించారు శాసన సభ్యులు కాటసాని రాంభూపాల రెడ్డి. 5932 ఎకరాలు, 23 కిలోమీటర్ల పరిధిలో సోలార్ పార్క్ ఏర్పాటైంది. చంద్రబాబు ప్రభుత్వానికి డబ్బులు మిగల్చానుకుని కలెక్టర్ చేసిన మోసంతో సాగు రైతులకు చాలా అన్యాయం జరిగింది. రైతుల నుంచి తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. శకునాల విలేజ్ కు సంబంధించి టీడీపీ నాయకుల భూములకు ఎన్.ఓ.సీ ఇచ్చారు కానీ పేద ప్రజల భూములకు మాత్రం ఇవ్వలేదు. నష్టపోయిన పేదరైతులకు రైతుబాంధవుడైన ముఖ్యమంత్రిగారు న్యాయం చేయాలి. భూములిచ్చిన రైతుల పిల్లలకు ఉద్యోగాలిస్తామన్న గత ప్రభుత్వం ఎంత మందికి ఇచ్చిందో చెప్పగలదా? ఇంజనీరింగ్, ఎంబీఏలు చేసిన వాళ్లున్నా ఒక్కరికి కూడా సరైన జాబ్ ఇప్పించలేదు. పారిశుధ్య పనులకు, పానల్ క్లీనింగ్ కు చిన్నపాటి ఉద్యోగాలిచ్చారు తప్ప పెద్ద చదువులు చదువుకున్న రైతుల పిల్లలెవరికీ ఉద్యోగాలు రాలేదు. దీనిపై ఆ గ్రామాల ప్రజలు, నిరుద్యోగులు కంపెనీ వద్దకు వెళ్లి ప్రశ్నిస్తే అరెస్టులు చేయించడం నిజం కాదా? ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు మరేదైనా కావచ్చు వాటి కోసం భూములిచ్చిన రైతులు నష్టపోకూడదు. వారికి పునరావాసం కల్పించాలి. అధికారులు చేసిన తప్పులకు రైతులు బలికాకుండా మంత్రిగారు చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాం. పండిచే భూములను సోలార్ ప్రాజెక్టు ఇచ్చిన రైతులకు న్యాయం చేయండి. వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమని కోరుతున్నాం.

Read Also: ఏడేళ్లుగా ఆరు కిలోమీటర్ల రోడ్డు వేస్తూనే ఉన్నారు

 

Back to Top