ఏడేళ్లుగా ఆరు కిలోమీటర్ల రోడ్డు వేస్తూనే ఉన్నారు

వైయస్‌ఆర్‌ హయాంలో నిధులు మంజూరైనా పూర్తి కాని రహదారి పనులు

పిడుగురాళ్ల జాతీయ రహదారిని పూర్తి చేయాలి  

ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి

అసెంబ్లీ: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జాతీయ రహదారికి నిధులు మంజూరు చేసినా పూర్తి చేయడం లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. 212 కిలోమీటర్ల జాతీయ రహదారిలో కేవలం 6 కిలోమీటర్లు వేసేందుకు ఏడేళ్ల సమయం పట్టిందని, ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కాసు మహేష్‌రెడ్డి మాట్లాడారు.  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ల క్రితమే వెనుకబడిన నల్గొండ, దాచేపల్లి, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, నకిరేకల్‌, అద్దంకి ప్రాంతాలన్ని అభివృద్ధి చేయాలని  ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి బ్రహ్మండమైన నార్కేడ్‌-అద్దంతి జాతీయ రహదారి అభివృద్ధి పనులు చేపట్టారు. నాలుగేళ్లలో సుమారు రూ.2 వేల కోట్లతో 212 కిలోమీటర్లు కలిగిన రోడ్డులో 206 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఏడు సంవత్సరాల నుంచి ఆరు కిలోమీటర్ల పిడుగురాళ్ల రోడ్డును వేస్తునే ఉన్నారు. హైవేకు రెండు కిలోమీటర్లు ఉన్న పిడుగురాళ్లలో సుమారు లక్ష జనాభా ఉంటుంది. ఈ రోడ్డుపై వెళ్లాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరు కిలోమీటర్లు ఎందుకు పూర్తి చేయడం లేదో అర్థం కావడం లేదు. భూ సమస్య ఉందన్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలి. ఈ రహదారిపై ఒక్క వాహనం ఆగినా అంబులెన్స్‌ కూడా వెళ్లలేని పరిస్థితి. ఉన్న రహదారి కూడా అధ్వాన్నంగా ఉంది. ఈ రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌  ఇచ్చిన మాటను నెరవేర్చుతున్నారు. ఆయన స్ఫూర్తితో అందరం పని చేద్దాం. వైయస్‌ఆర్‌ కన్న కలను సాకారం చేద్దాం.

Read Also: విద్యలో నాణ్యత ప్రమాణాలు ఉండేలా చర్యలు

 

తాజా ఫోటోలు

Back to Top