గుంటూరు: తమను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చినప్పుడు, ఇంట్లో దొంగతనం జరిగిందన్న ప్రచారం పచ్చి అబద్ధం. అది పూర్తిగా సత్యదూరం. జగన్‌గారు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగలేదు. ఆ సమయంలో మా ఇంట్లోకి వచ్చిన కొందరు దోచుకుపోయారంటూ, ఐటీడీపీ నిర్వహిస్తున్న సోషల్ మీడియా ఛానల్ ‘థింక్ ఆంధ్ర’లో కథనం ప్రసారం చేశారు. ఇంకా సీనియర్ జర్నలిస్టు పేరుతో రోజూ జగన్‌గారిపై విషం చిమ్మే ఒక వ్యక్తి, విశ్లేషకుడి పేరుతో టీడీపీ ప్రచారం చేస్తున్న మరో వ్యక్తి చాలా నీచంగా మాట్లాడారు. ఆ టీడీపీ సోషల్ మీడియా ఛానల్ ప్రసారం చేసిన కథనం కానీ, ఆ ఇద్దరు మాట్లాడిన మాటలు కూడా పూర్తిగా అవాస్తవం. జగన్‌గారు మా ఇంటికి వచ్చిన సమయంలో దొంగతనం జరిగిందంటూ, కేవలం మా కుటుంబ ప్రతిష్టను దిగజార్చడం కోసం, జగన్‌గారిపై బురద చల్లడం కోసం టీడీపీ సోషల్ మీడియా చేసిన దుష్ప్రచారం అది. మా ఇంటిపై టీడీపీ గుండాలు దాడి చేసి సర్వం నాశనం చేశారు. మా నాన్నగారిపై హత్యాయత్నం చేయడమే కాకుండా, అక్రమ కేసులు బనాయించి, జైలుకు పంపారు. తీవ్ర బాధలో ఉన్న మమ్మల్ని ఓదార్చడానికి జగన్‌గారు వచ్చారు. ఆయన వెంట వేలాది జనం తరలి వచ్చారు. అది మీరు జీర్ణించుకోలేక, మా ప్రతిష్టను ఇంకా దిగజార్చడం కోసం ఇంత నీచానికి ఒడిగట్టడం హేయం. అందుకే ‘థింక్ ఆంధ్ర’ సోషల్ మీడియా ఛానల్‌పైనా, కామెంట్స్ చేసిన ఆ ఇద్దరిపైనా చట్టరీత్యా చర్య తీసుకోబోతున్నామని అంబటి మౌనిక. అంబటి రాంబాబు కుమార్తె మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.