విద్యలో నాణ్యత ప్రమాణాలు ఉండేలా చర్యలు

ప్రభుత్వ ఉపాధ్యాయుల స్థితిగతులను మెరుగుపరుస్తాం

ఎయిడెడ్‌ సంస్థల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం

మంత్రి ఆదిమూలపు సురేష్‌

అసెంబ్లీ: విద్యలో నాణ్యత ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే ఉదయభాను ఎయిడెడ్‌ అధ్యాపకుల సమస్యలపై ప్రశ్నించడంతో మంత్రి సమాధానం చెప్పారు. ఎయిడెట్‌ కాలేజీలు, స్కూల్స్‌, డిగ్రీ కాలేజీల్లో పని చేసే అధ్యాపకుల స్థితిగతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎయిడెట్‌ కాలేజీల్లో పని చేసే అధ్యాపకుల స్థితిగతులు, వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్‌ కోసం ఓ రూల్స్‌ ప్రకారం సకాలంలో ఇవ్వాల్సి ఉంది. అయితే ఇది చాలా చోట్ల జరగడం లేదు.  ఉపాధ్యాయుల స్థితిగతులను మెరుగు పరుస్తామని స్పష్టంగా చెప్పాం. నవరత్నాల్లో భాగంగా ఉపాధ్యాయుల స్థితిగతులను మార్చుతాం. రెగ్యులేటరీ, మానిటరింగ్‌ కమిషన్‌ ఏర్పాటు చేశాం. దీని పరిధిలోని వీరిని తీసుకొచ్చాం. టీచింగ్‌ కమ్యూనిటీని రెగ్యులరైజ్‌ చేయాలి. వారి జీవన ప్రమాణాలు మార్చాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేశాం. అవకాశం ఉన్న మేరకు న్యాయం చేస్తాం. ఎయిడెడ్‌ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను గతంలో భర్తీ చేయలేదు. పోస్టులు భర్తీ చేయకపోవడంతో విద్యా నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, మౌలిక వసతులు పెంచాల్సి ఉంది. 

Read Also: పోల‌వ‌రం నిధులు విడుద‌ల చేయండి

తాజా ఫోటోలు

Back to Top