పోల‌వ‌రం నిధులు విడుద‌ల చేయండి

రాజ్య‌స‌భ‌లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

రాజ్య‌స‌భ: పోల‌వ‌రం నిర్వాసితుల‌కు ప‌రిహారం, పున‌రావాసంపై రూ.16 వేల కోట్లు విడుద‌ల చేయాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కేంద్ర‌ప్ర‌భుత్వాన్నివిజ్ఞ‌ప్తి చేశారు. నీటి సంకోభం నివార‌ణ కోసం జాతీయ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త‌పై కాలింగ్ అటెన్ష‌న్ మోష‌న్‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి  మాట్లాడారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పోల‌వ‌రం ప్రాజెక్టును 2021 క‌ల్లా పూర్తి చేయాల‌న్న సంక‌ల్పంతో ఉన్నార‌న్నారు. అంచ‌నా వ్య‌యానికి సంబంధించిన డీపీఆర్‌ను ఆమోదించాల‌ని, పోల‌వ‌రం నిర్వాసితుల‌కు పున‌రావాసం క‌ల్పించాల‌న్నారు. నిధులు కూడా త్వ‌ర‌గా విడుద‌ల చేయాల‌ని కోరారు. పోల‌వ‌రంపై కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి షెకావ‌త్‌ను ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వివ‌ర‌ణ కోరారు. పోల‌వ‌రం ప్రాజెక్టు అంచ‌నాల‌పై రూపొందించిన డీపీఆర్‌ను ఆమోదించాం.. త‌దుప‌రి ఆమోదం కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ‌కు పంపించామ‌ని, సిఫార‌స్సులు చేసేందుకు మంత్రిత్వ శాఖ క‌మిటీ ఏర్పాటు చేసింద‌ని కేంద్ర‌మంత్రి షెకావ‌త్ స‌మాధానం ఇచ్చారు.  

Read Also: చంద్రబాబులో ఏదో తేడా కనిపిస్తోంది

తాజా ఫోటోలు

Back to Top