తాడేపల్లి: అండర్-19 ప్రపంచకప్‌లో భారత యువ జట్టు చారిత్రక విజయం సాధించడంపై వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జట్టు సభ్యులకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. వైయస్ జగన్ ఎక్స్ వేదికగా.. ‘‘మన అండర్-19 జట్టు ప్రపంచకప్ విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు. మైదానంలో మీరు చూపిన పట్టుదల, క్రమశిక్షణ చూసి దేశం ఎంతో గర్వించింది. ఈ యువ క్రీడాకారులు భారతదేశ భవిష్యత్తుకు వెలుగులు నింపే ప్రతిభావంతులు. ఈ విజయంతో మీరు మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని, కొత్త విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. మొత్తం జట్టుకు నా శుభాకాంక్షలు’’ అంటూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు