చాలా శాడిజంగా దుర్భాష‌లాడాడు

ఎమ్మెల్యే  అన్నాబ‌త్తుని శివ‌కుమార్‌ 

గుంటూరు:  పోలింగ్ స్టేష‌న్ వ‌ద్ద గొట్టిముక్క‌ల సుధాక‌ర్ చాలా శాడిజంగా దుర్భాష‌లాడాడ‌ని తెనాలి ఎమ్మెల్యే అన్నాబ‌త్తుని శివ‌కుమార్ పేర్కొన్నారు. తెనాలి ఐతాన‌గ‌ర్‌లో నా భార్య‌తో క‌లిసి ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డానికి వెళ్లామ‌ని అన్నాబ‌త్తుని శివ‌కుమార్ తెలిపారు.  ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వ‌ర్గాల‌కు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్క‌ల సుధాక‌ర్ నానా దుర్భాష‌లాడార‌ని అన్నాబ‌త్తుని శివ‌కుమార్ తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీపై చాలా ధ్వేషంతో ర‌గిలిపోయాడు. నా భార్య ముందే న‌న్ను అస‌భ్యంగా ధూషించాడ‌ని అన్నాబ‌త్తుని శివ‌కుమార్ చెప్పారు. బూత్‌లోకి వెళ్లేట‌ప్పుడు..వ‌చ్చేట‌ప్పుడూ దుర్భాష‌లాడుతూనే ఉన్నాడు.   గొట్టిముక్క‌ల సుధాక‌ర్ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన టిడిపి వ్య‌క్తి.    నువ్వు అస‌లు క‌మ్మోడివేనా అంటూ అస‌భ్యంగా మాట్లాడాడు.  పోలింగ్ బూత్ వ‌ద్ద మ‌ద్యం మ‌త్తులో అంద‌రి ముందు చాలా దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు.  పోలింగ్ బూత్‌లో ఉద‌యం నుండి అత‌డు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ట్లు అక్క‌డి ఓట‌ర్లే చెప్పారు. అత‌డు బెంగులూరులో ఉంటూ ఇక్క‌డ‌కు వ‌చ్చి హ‌డావిడి చేశాడు. టిడిపి - జ‌న‌సేన వాళ్లు ఎక్క‌డెక్క‌డి నుండో వాళ్ల మ‌నుషుల‌ను పిలిపించి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల‌పై దాడులు చేయిస్తున్నార‌ని అన్నాబ‌త్తుని శివ‌కుమార్ పేర్కొన్నారు.

Back to Top