కాపుల రిజర్వేషన్లపై ప్రభుత్వం కట్టుబడి ఉంది

కాపులను వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుంది

కాపుల సంక్షేమానికి ప్రతి రూపాయి ఖర్చుపెడతాం

కాపులపై టీడీపీది సవతి తల్లి ప్రేమ

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

అమరావతిః కాపుల రిజర్వేషన్లపై వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని  ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు.మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపులకు సంబంధించి  మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు అమలుకు వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కాపులకు ఇచ్చిన మాట ప్రకారం  ఏడాదికి  రెండువేల కోట్ల రూపాయలు బడ్జెట్‌ కేటాయించి  సీఎం వైయస్‌ జగన్‌ మాటను నిలుపుకున్నారన్నారు. ఇది కాపుల పట్ల వైయస్‌ఆర్‌సీపీ ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కాపులకు 5వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి.. మొదటి సంవత్సరంలో 100 కోట్లు మాత్రమే కేటాయించారని..ఇచ్చింది మాత్రం సున్నా అని తెలిపారు. రెండవ సంవత్సరంలో బడ్జెట్‌లో 100 కోట్లు పెట్టి..90 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు.టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో 18,00 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని ధ్వజమెత్తారు. చెప్పిన మాటకు..ఇచ్చిన డబ్బుకు పొంతన లేదన్నారు.

కాపులను బీసీల్లో చేర్చాలని ఉద్యమాలు జరిగాయని, అప్పటి వరుకూ టీడీపీ ప్రభుత్వానికి కాపులను బీసీల్లో చేర్చాలన్న ఆలోచనే రాలేదన్నారు.కనీసం కమిటీ కూడా వేయాలన్న తపన కూడా లేదన్నారు. వేసిన కమిషన్‌తో తప్పుడు రిపోర్టులు ఇప్పించారని మండిపడ్డారు. బీసీ కమిషన్‌  ఛైర్మన్‌ సంతకం కూడా లేకుండా రిపోర్టులు ఇచ్చారన్నారు. కేంద్రం ఈబీసీలో వచ్చిన పది శాతాన్ని అందులో 5 శాతం కేటాయిస్తారా లేదా అని టీడీపీ  నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని..40 ఏళ్ల అనుభవం ఏమైపోయిందో మాకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేయడానికి టీడీపీ ప్రయత్నం చేస్తుందన్నారు. కాపులను ఇంకా మభ్యపెట్టి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని దుయ్యబట్టారు.కేవలం 23 మంది సభ్యులతో టీడీపీని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చొపెట్టిన ఇంకా బుద్ధిరాలేదన్నారు.సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రాష్ట్రంలో కాపులను అన్నివిధాలుగా ఆదుకుంటారని, వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని తెలిపారు.కాపులకు కేటాయించిన ప్రతి రూపాయిని వారి సంక్షేమానికి ఖర్చుపెడతామని తె లిపారు.ప్రజా రంజక బడ్జెట్‌కు అడ్డుతగలవద్దని టీడీపీ సభ్యులకు హితవు పలికారు. 

 

తాజా ఫోటోలు

Back to Top