బీసీలకు నవరత్నాల కింద ఆర్థిక సాయం

అమ‌రావ‌తి: వెనుకడిన తరగతులు, చేతివృత్తులవారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి నవరత్నాల కింద వివిధ ఆర్థిక సహాయ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శాసన సభలో చెప్పారు. వైయ‌స్ఆర్  నేతన్న నేస్తం, వైయ‌స్ఆర్‌ మత్స్యకార భరోసా, వైయ‌స్ఆర్‌  వాహన మిత్ర, జగనన్న చేదోడు, జగనన్న తోడు పథకాల ద్వారా వెనుకబడిన తరగతులవారికి ఆర్థిక సాయం చేస్తున్నామని  మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శాసన సభలో చెప్పారు.
2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 వరకు వృత్తిపరమైన వర్గాలకు చెందిన సుమారు 11 లక్షల 73 వేల 18 మంది లబ్దిదారులకు 2,272.31 కోట్ల రూపాయలు వినియోగించామని మంత్రి వివ‌రించారు. 

తాజా ఫోటోలు

Back to Top