టీడీపీ హయాంలో ఏరులైపారిన మద్యం

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌
 

అమరావతి: తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సోమవారం సభలో మంత్రి మాట్లాడుతూ..కార్తీక మాసంలో అయ్యప్పమాల వేస్తే సారా అమ్మకాలు తగ్గుతున్నాయని చంద్రబాబు ఆరోజు బాధపడిన వ్యక్తి ..ఈ రోజు మద్యం గురించి మాట్లాడటం సిగ్గు చేటు. టీడీపీ హయాంలోనే కొత్త బ్రాండ్లకు పర్మిషన్‌ ఇచ్చారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారడానికి చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వమే కారణం. ఈ రోజు మద్యం గురించి టీడీపీ సభ్యులు మాట్లాడటం వింతగా ఉంది. టీడీపీ డ్రామాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాల్సిన అవసరం ఉందని వెల్లంపల్లి శ్రీనివాస్‌ కోరారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top