దేశమంతా వెతికి చూసినా వైయ‌స్ జ‌గ‌న్ లాంటి సీఎం ఎవ‌రూ లేరు

రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత

మాది మహిళా పక్షపాత ప్రభుత్వం

 విశాఖపట్నం:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను గుర్తించి, గౌరవించి కీలకమైన బాధ్యతలు అప్పగించార‌ని రాష్ట్ర హోం మంత్రి తానేటి వ‌నిత తెలిపారు. దేశమంతా వెతికి చూసినా.. మనకు ఇంతటి గౌరవం, రాజ్యాధికారాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు తప్ప ఎవరూ లేర‌న్నారు. సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర రెండో రోజు గాజువాక నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా గాజువాకలో ఏర్పాటు చేసిన సభలో ఎస్సీ,  ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పలువురు మంత్రులు ప్రసంగించారు. ఒక్క జగనన్న తప్ప, గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంత గౌరవం, రాజ్యాధికారం ఇచ్చిన వారు ఎవరూ లేరు అని మంత్రులు అన్నారు.  

మరోవైపు మహిళా పక్షపాత ప్రభుత్వంగా, ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మహిళల పేరుతోనే ఇవ్వడం అందరూ గమనించాలి. మన బిడ్డల్ని చదవించడానికి అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మన బిడ్డల భవిష్యత్‌ కోసం ఎన్నో లక్షల కుటుంబాల్లో విద్యా దీపాన్ని వెలిగించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు. మేనమామగా జగనన్నమన బిడ్డల బాధ్యత తీసుకుని అమ్మ ఒడి పథకం ద్వారా చదవిస్తున్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి, సొంత ఇంటి కలను నెరవేర్చడానికి 31 లక్షల ఇంటి స్థలాలను మహిళల పేరుతోనే ఉచితంగా ఇచ్చారు.

మేనిఫెస్టోలో పెట్టిన హామీల అమలు కోసం, కరోనా విపత్తు వచ్చినా, రాష్ట్రం మీద ఆర్థిక భారం పడినా, ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆసరా, చేయూత పథకాలతో అండగా ఉంటున్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు కలలు కన్నట్లుగా మహిళా సాధికారిత సాధించేలా, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా జగన్ మోహన్  రెడ్డిగారు మహిళల్ని ప్రోత్సహిస్తున్నారు.

 దేశ చరిత్రలో ఎక్కడా కనీవినీ ఎరుగని విధంగా ప్రభుత్వంలో నామినేటెడ్‌ పదవులు, పనుల్లో కూడా మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించారు. ప్రతి పదవుల్లోనూ బడుగు, బలహీన వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పించడమే కాకుండా అందులో కూడా, మహిళలకు యాభైశాతం రిజర్వేషన్లు కల్పించారు. మన రాష్ట్రంలో జరిగినంత సాధికారత ఏ రాష్ట్రంలోనూ జరగలేదని చెప్పడానికి గర్వపడుతున్నాం. 

జగనన్న పరిపాలనలో ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండటానికి కారణమైన చరిత్రాత్మకమైన నిర్ణయాలకు కట్టుబడి, జగనన్నను గతంలో ఏవిధంగా ఆశీర్వదించామో, ఆదరించామో... అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఆశీర్వదించాలని, మహిళల చల్లని దీవెనలు జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం.

అమలాపురం విధ్వంసంపై..
 కోనసీమలో జరిగిన అల్లర్లపై సమగ్ర దర్యాప్తు జరుగుతుంది.  అమలాపురం విధ్వంసం వెనుక ఎవరు ఉన్నా కఠిన చర్యలు ఉంటాయి. దీని వెనుక జనసేన, టీడీపీలకు చెందిన కార్యకర్తలు ఉన్నట్టు ఇప్పటికే పోలీసుల విచారణలో తేలింది. మా మంత్రి ఇల్లు, మా ఎమ్మెల్యే ఇల్లు మేమే తగలబెట్టుకున్నామని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మాట్లాడటం సిగ్గుచేటు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టాలని అడిగిన వారే.. తర్వాత మాటలు మార్చారు, ప్రజల ముందు ఒక మాట, ప్రజల వెనుక మరో మాట మాట్లాడే టీడీపీ, జనసేన పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారు. 

Back to Top