సంక్షేమంలో చరిత్ర సృష్టిస్తున్నారు

పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ

గుంటూరు: ఆరు నెలల పాలనలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతీ సంక్షేమ పథకం ఒక చరిత్ర సృష్టించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. పరిపాలనలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ఎవరూ ఊహించని విధంగా వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని తీసుకువచ్చారని మంత్రి చెప్పారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా పథకం ప్రారంభోత్సవంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ.. పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. సమాజంలో సాటి మానవుడు జీవించేందుకు అవసరమైన పట్టెడు అన్నం. ప్రపంచంతో పోటీ పడి నిలబడే   విజ్ఞానాన్ని సంపాదించేందుకు విద్య, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించేందుకు  ఆరోగ్యశ్రీ.. ఈ మూడు పథకాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.  పేదరికం చదువుకు అడ్డుకాకూడదని పూర్తి ఫీజురియింబర్స్‌మెంట్, విద్యార్థులకు జగనన్న సవతి దీవెన కింద ఆర్థికసాయం అందిస్తున్నారని వివరించారు. 

గడిచిన ఐదేళ్లలో నిర్వీర్యం అయిన ఆరోగ్యశ్రీని సీఎం వైయస్‌ జగన్‌ పూర్తిగా ప్రక్షాళన చేశారన్నారు. చిన్న వ్యాధి నుంచి పెద్ద రోగం వరకు నయం చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ ద్వారా అవకాశం కల్పించారన్నారు. పేదరికంలో ఉంటూ ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకునే సమయంలో ఆ కుటుంబానికి ఆదుకునేందుకు వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా ద్వారా  ఆర్థికసాయం అందిస్తూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. పేదరిక నిర్మూలనకు ప్రవేశపెడుతున్న పథకాలు చూసి సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వం ఎల్లవేళలా మాకు కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. 
 

Read Also: ‘వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా’ ప్రారంభం 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top