మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

మంత్రి మోపిదేవి వెంకటరమణ

పాదయాత్రలో మత్స్యకారుల సమస్యలు వైయస్‌ జగన్‌ చూశారు

రేపటి నుంచే మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ అమలు

అమరావతి: మత్స్యకారుల సంక్షేమానికి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. గురువారం సభలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో మత్స్యకారుల సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. మత్స్యకారుల జీవన విధానంలో మార్పు తీసుకువచ్చే చర్యలు గత ప్రభుత్వం చేయలేదని విమర్శించారు. పాదయాత్రలో మత్స్యకారుల సమస్యలు వైయస్‌ జగన్‌ దగ్గరుండి చూశారని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మత్స్యకారులకు బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

పవర్‌ టారీఫ్‌ గతంలో యూనిట్‌ రూ.2 ఉండేదని, దాన్ని మా ప్రభుత్వం రూ.1.50కు తగ్గించిందని, దాని వల్ల ప్రభుత్వంపై రూ.720 కోట్లు అధనపు భారం పడుతుందని వివరించారు. ప్రకృతి వైఫరీత్యాలు, వేటకు వెళ్లి ఏదైనా సంభవించినప్పుడు మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రకటించడం పేదలపై ఆయనకు ఉన్న అపార ప్రేమకు నిదర్శనమన్నారు. సబ్సిడీ డీజిల్‌కు సంబంధించి రెండేళ్లుగా బకాయిలు ఉన్నాయని, గతంలో చంద్రబాబు డిజీల్‌ సబ్సిడీ రూ.12.96కు పెంచుతామని చెప్పారని, ఈనాటికి అది అమలులోకి రాలేదన్నారు. వైయస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటి కేబినెట్‌లోనే డిజీల్‌ సబ్సిడీ రూ.12.96 రేపటి నుంచి అమలులోకి  తీసుకువస్తామన్నారు. సబ్సిడీ మొత్తం అదే రోజు జమా అవుతుందన్నారు. కోస్తా తీర ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టినప్పుడు మత్స్యకారుల జీవనోపాధికి దెబ్బ తగులుతుందన్నారు. అలాంటి సమయంలో మత్స్యకారులకే అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. 
 

Back to Top