భక్తుల మనోభావాల్ని రెచ్చగొట్టడమే  జర్నలిజమా రామోజీ..?

మీడియా స‌మావేశంలో  డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి  కొట్టు సత్యనారాయణ 

విజయవాడలో బాబు 40 గుడుల్ని కూల్చితే ఒక్క ముక్క అయినా రాశావా రామోజీ ..?

చంద్రబాబు చేసిన పాపాలకు, దుర్మార్గాలకు ఆయన్ను దేవుడు క్షమించడు

బాబు హయాంలోనే దేవాలయాల పవిత్రతను మంటగలిపారు.. విగ్రహాల్ని ధ్వంసం చేసి చెత్తడబ్బాల్లో పడేశారు..

కనకదుర్గమ్మ గుళ్లో బాబు తాంత్రికపూజలు చేయించి నిజం కాదా..?

అబద్ధాల చంద్రబాబుకు వత్తాసుపలకడానికి రామోజీ సిగ్గుపడాలి

మా ప్రభుత్వంపై బుద్ధి, జ్ఞానం లేని రామోజీ విషపు రాతల్ని ఖండిస్తున్నాం..

డిప్యూటీ సీఎం శ్రీ కొట్టు సత్యనారాయణ ఫైర్‌

దేవుని ఆశీస్సులతో మళ్లీ సీఎంగా జగన్‌ గారు

జగన్‌గారు చెప్పిందే చేస్తాడు.. చేసిందే చెబుతాడు

ఆయన మార్క్‌ పరిపాలన ప్రజల మెదళ్లలో నాటుకుపోయింది

కనుకనే, నిన్న మా పార్టీ ‘సిద్ధం’ సభ సక్సెస్‌ అయ్యింది

డిప్యూటీ సీఎం శ్రీ కొట్టు సత్యనారాయణ వెల్లడి

విజ‌య‌వాడ‌: భక్తుల మనోభావాల్ని రెచ్చగొట్టడమే  జర్నలిజమా రామోజీ..? అంటూ  డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి  కొట్టు సత్యనారాయణ మండిప‌డ్డారు.
 
మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
  
*‘సిద్ధం’ సభ సూపర్ సక్సెస్ః*
దెందులూరు నియోజకవర్గంలో నిన్న జరిగిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  ‘సిద్ధం’ సభ సూపర్ సక్సెస్‌ అయ్యింది. మా పార్టీ అధినేత శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి పిలుపుమేరకు లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. గోదావరి జిల్లాల చరిత్రలోనే ఎవరూ ఊహించనంత రికార్డు బ్రేక్‌ సభగా జరిగింది. ఈ సభలో జగన్‌ గారి ప్రసంగం ప్రతీ ఒక్కరి హృదయాన్ని తాకింది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, వారి శ్రేయస్సుకు తీసుకున్న సంస్కరణల పట్ల ఏ నోట విన్నా మంచి స్పందన వినిపిస్తోంది. జగనన్న అంటే మాట తప్పడు.. మడమతిప్పడు. చెప్పిందే చేస్తాడు.. చేసిందే చెబుతాడు అనే బ్రాండ్‌ ప్రజల మెదళ్లలో నాటుకుపోయింది. కనుకనే, నిన్న మా పార్టీ సిద్ధం సభ అంతగా సక్సెస్‌ అయ్యింది. ఇంతటి ప్రతిష్టాత్మక సభను విజయవంతం చేసిన ప్రతీ వైఎస్‌ఆర్‌సీపీ నేతకు, కార్యకర్తలకు పేరుపేరునా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

*‘ఈనాడు’ కుళ్లుబోతు రాతల్ని ఖండిస్తున్నాం..ః*
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకొచ్చిన దగ్గర్నుంచీ ఈనాడు దినపత్రిక చాలా కుళ్లుబోతుతనాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో గడచిన 56 నెలలు గా ప్రభుత్వం చేసిన మంచిని జగన్‌గారు వివరించడం.. అందుకు ప్రజాస్పందన వెల్లువెత్తడం ఈనాడు రామోజీరావుకు నచ్చడం లేదు. రోజురోజుకు పేదోడి చెంతకు చేరువవుతోన్న వైఎస్‌ఆర్‌సీపీని ఎలాగోలా కట్టడి చేయాలనేది రామోజీరావు తాపత్రయంగా పెట్టుకున్నాడేమో.. లేదంటే, ఇప్పటికే గాల్లో కలిసిపోయిన తెలుగుదేశం పార్టీకి మళ్లీ జవసత్వాలకు ఆరాటపడుతున్నాడేమో గానీ.. మొత్తానికి ప్రభుత్వంపై అదేపనిగా బురదజల్లే కుట్రలకు తెగబడ్డాడు. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈనాడు దినపత్రికలో భక్తుల మనోభావాలంటూ దేవాలయాలపై విషకథనం రాశాడు. భక్తుల మనోభావాల్ని రెచ్చగొట్టడమే ఈనాడు జర్నలిజమా రామోజీ..? ఇలాంటి అబద్ధపు రాతల ద్వారా రామోజీరావు తన కుళ్లుబోతుతనాన్ని ప్రదర్శించే వైనాన్ని మేం పూర్తిగా ఖండిస్తున్నాము. 

*చంద్రబాబును దేవుడు కూడా క్షమించడుః*
హిందూధర్మాన్ని కాపాడటం.. దేవాలయాలు పరిరక్షించడంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు చూపినంత చిత్తశుద్ధి గతంలో ఎవరూ చూపించలేదన్నది వాస్తవం. అలాంటి జగన్‌గారికి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎక్కడా పోలికలేదు. చంద్రబాబు హయాంలో దేవాలయాల్ని ఇష్టానుసారంగా కూల్చివేశారు. వాటిని చెత్తను తరలించే డస్ట్ బిన్‌లలో విసిరేసి దుర్మార్గమైన నైజాన్ని చాటుకున్నారాయన.  ఆయన హయాంలో విజయవాడలో 40 దేవాలయాల్ని కూల్చేసి , పవిత్ర విగ్రహాలను చెత్త వేసే డంపింగ్‌యార్డుల్లో పడేసిన దుష్ట చరిత్ర చంద్రబాబుది. తిరుమలలో ధ్వజస్థంభం వరకు బూట్లు వేసుకుని వెళ్లాడు కనుకే, అప్పట్లో అలిపిరి దుర్ఘటన జరిగింది. అయినా బాబుకు  బుద్ధిరాలేదు. కనకదుర్గమ్మ గుడిలో అర్ధరాత్రి క్షుద్రపూజలు చేయించిన నీచుడు. గుళ్లు కూల్చివేయించాడు. విగ్రహాలు ధ్వంసం చేయించాడు. రథాలు తగులబెట్టించాడు. ఇన్నీ చేసినా ఈనాడు రామోజీరావుకు మాత్రం కనిపించలేదు. ఆయా ఘటనలకు సంబంధించి ఒక్క వార్త కూడా ఈనాడు పత్రికలో రాయలేదు ఎందుకు..? చంద్రబాబు అనే దుర్మార్గ నేతను దేవుడు కూడా క్షమించడు గాక క్షమించడు. 

*బాబు అబద్ధాలంటే ఈనాడుకు ఎందుకంత నమ్మకం..?ః*
అబద్ధాలు అల్లి పలకడంలో చంద్రబాబును మించినోళ్లు ప్రపంచంలో ఎవరూ లేరు. సెల్‌ఫోన్‌ కనిపెట్టానంటాడు. ప్రపంచానికే సాంకేతిక పరిజ్ఞానం తన వల్లనే అందిందంటాడు. హైదరాబాద్‌ను పుట్టించాన టూ.. ఐటీ సృష్టికర్తనంటూ నోటికొచ్చిన అబద్ధమల్లా చెబుతుంటాడు. అలాంటి, చంద్రబాబును, ఆయన చెప్పే అబద్ధాల్ని ఈనాడు దినపత్రిక గుడ్డిగా నమ్ముతుంది. తాను నమ్మినదాన్నే ప్రజలు కూడా నమ్మాలని ఊదరగొట్టు వార్తా కథనాల్ని రాయిస్తోంది. హైదరాబాద్‌లో ఓఆర్‌ఆర్‌కు, విమానాశ్రాయానికీ చంద్రబాబుకు అసలు సంబంధం ఏంటి..? అన్నీ నేనే చేశానని చెప్పుకునే ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్ర సంపదను దోచేసిన ఘనుడ్ని కూడా నేనే అని చెప్పుకుంటే మంచిది. అలాంటి, పచ్చి అబద్ధాలకోరుకు ఈనాడు దినపత్రిక వత్తాసు పలకడం దురదృష్టకరం. ఇందుకు రామోజీరావు సిగ్గుపడాలి. 
                                                   
*రాద్ధాంతాలకు కారకులు మీరేనేమో..?ః*
చంద్రబాబు గతంలో చేసిన పాపాలు, దుర్మార్గాలతోనే 2019లో ప్రజాదరణను కోల్పోయాడు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఇంతకుముందు రూ.300 టిక్కెట్‌ కొన్న భక్తులు బయటనుంచే దర్శనం చేసుకునే పరిస్థితి ఉండేది. అలాంటిది, అలాంటిది, మేం ఆ విధానాన్ని పూర్తిగా మార్చి, విఐపీ భక్తులూ ఖచ్చితంగా రూ.500 టిక్కెట్‌ తీసుకోవాల్సిందేనని చెప్పి.. అమ్మవారిని దగ్గరగా దర్శనం చేయిస్తున్నాం. అయితే, దీనిపై కూడా టిక్కెట్ల ధరలు పెంచారని రాద్ధాంతం చేశారు. అన్నవరంలో కూడా దళారీవ్యవస్థకు చెక్‌ పెట్టేందుకు కొన్ని విధానపరమైన నిర్ణయాలనూ తీసుకున్నాం. వాటినీ విమర్శించేందుకు ఈనాడు రామోజీరావు బరితెగించారు. సింహాచలం ట్రస్టు విషయంలోనూ ప్రభుత్వానికి సంబంధంలేని అంశాల్ని తెరమీదికి తెచ్చి వివాదం చేశారు. అదేవిధంగా రామతీర్థం విగ్రహ ధ్వంసం.. ఇలా చెప్పుకుంటే పోతే ప్రతీదీ ఏదొక వివాదాన్ని ప్రభుత్వానికి అంటగట్టాలని చంద్రబాబు, ఈనాడు రామోజీరావు ప్రయత్నించారు. అయితే, వారి హడావిడి, ఆత్రం గమనిస్తే.. ఈ ఘటనలన్నింటికీ ప్రధాన కారకులు వారేనేమోననే అనుమానం కూడా కలుగుతుంది. 

*జగన్‌ గారికి దేవుని ఆశీస్సులు పుష్కలంః*
మేమంటే గిట్టనోళ్లు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం మీద విషం కక్కినా.. రాజకీయ కుట్రలకు పాల్పడినా.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం దేవుని ఆశీస్సులతో ముందుకెళ్తున్నారు. ప్రజలకు సుపరిపాలనను అందివ్వడంలో తనదైన మార్కు వేసుకుని ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని ప్రతీ గడపా ఈరోజు వైఎస్‌ఆర్‌ సీపీకి హారతి పట్టి స్వాగతం పలుకుతోంది. మరలా సీఎంగా జగన్‌ గారే రావాలని కోరుకుంటోంది. కనుకే, ఆ ధీమాతోనే ప్రజల సంక్షేమానికి 124 సార్లు బటన్‌ నొక్కానని.. మీరు రెండుసార్లు బటన్‌నొక్కి వైఎస్‌ఆర్‌సీపీని గెలిపించండని జగన్‌ గారు దమ్ముగా కోరుతున్నారు. అన్ని మతాల దేవుళ్లను గౌరవించి వారి సంప్రదాయాలకనుగుణంగా ప్రభుత్వం నడుచుకున్నందునే భగవంతుని ఆశీస్సులు మా నాయకుడు జగన్‌గారికి మెండుగా ఉన్నాయి. కాబట్టే.. మరోమారు సీఎంగా అధికారంలోకి రాబోతోన్నారు. 

Back to Top