వ్యాక్సిన్‌ తెప్పించండి బాబూ..ఎంత డబ్బైనా ఫర్వాలేదు ఇస్తాం!

చంద్రబాబుకు మంత్రి మంత్రి కొడాలి నాని సవాలు

కరోనా ట్రీట్‌మెంట్‌కు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది

హెరిటేజ్‌ పాలల్లో నీళ్లు కలిపినట్లు కాదు..వ్యాక్సిన్‌ తయారు చేయడం

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు సీబీఎన్‌ 420 అనేది నారావారిపల్లెలో పుట్టింది

కర్నూలులో ఎన్‌440కే వెరియంట్‌ నిర్ధారణ కాలేదు

కరోనా సమయంలో ఎన్నికలు వద్దన్నా వినలేదు

కరోనా విజృంభణకు చంద్రబాబు, ఎల్లోమీడియానే కారణం

వ్యాక్సీన్లు కావాలని కేంద్రానికి ఇప్పటికే సీఎం వైయస్‌ జగన్‌ రెండుసార్లు లేఖ రాశారు

కరోనా కన్నా భయంకరమైన లక్షణాలతో బయట నలుగురు వ్యక్తులు ఉన్నారు

ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది

కరోనా కట్టడికి కేంద్రం, రాష్ట్రాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయి

తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మంత్రి కొడాలి నాని బహిరంగ సవాలు విసిరారు. చంద్రబాబు బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ చెబితే..వ్యాక్సీన్‌ కోసం ఎంత డబ్బైనా ఫర్వాలేదు ప్రభుత్వం ఇస్తుందని, ఆయనకు దమ్ముంటే టీకా తెప్పించాలని మంత్రి కొడాలి నాని చాలెంజ్‌ చేశారు. రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై జూమ్‌యాప్‌లో చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న చంద్రబాబుపై కేసు పెట్టాలని ఆయన సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. కరోనా కట్టడికి కేంద్రం, రాష్ట్రాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

ఇవాళ కరోనా వైరస్‌ మానవ జాతిపై దాడి చేసింది. ప్రజలను కాపాడుకునేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటే..కరోనా కన్నా భయంకరమైన లక్షణాలతో బయట నలుగురు దుర్మార్గులు కుట్ర చేస్తున్నారు. మొదటి వ్యక్తి చంద్రబాబు, రెండో వ్యక్తి ఈనాడు రామోజీ రావు, మూడు ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ 5 బీఎన్‌ నాయుడు. వీరు కుల గజ్జితో అధికారంలో మేమే ఉండాలి. రాష్ట్ర సంపదను మేమే దోచుకోవాలి. ఎంతకైనా దిగజారిపోవచ్చు. రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులను సృష్టించవచ్చు. మన వద్ద రెండు చెత్త పేపర్లు, నాలుగు డబ్బా చానల్స్‌ ఉన్నాయి. శ్మశానంలో కెమెరాలు పెట్టి ఫొటోలు, వీడియోలు తీయవచ్చు అన్న పిచ్చ భ్రమలో ఈ నలుగురు బతుకుతున్నారు. 

టీకాలు వేయడానికి ముఖ్యమంత్రి ఎందుకు వెనుకాడుతున్నారని చంద్రబాబు జూమ్‌లో అంటారు. దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్డింగ్‌ పెట్టి డబ్బా పేపర్లలో వార్తలు రాస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వివిధ సంక్షేమ పథకాల ద్వారా వేల కోట్లు ప్రజలకు నేరుగా అందజేస్తున్నారు. ఇప్పటికే అమ్మ ఒడికి, రైతు బరోసా, పింఛన్లకు వేల కోట్లు ఇంటికే పంపిస్తున్నారు. డోర్‌ డెలివరీతో బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇన్ని చేసిన ముఖ్యమంత్రికి కరోనా టీకాకు రూ.1600 కోట్లు ఖర్చు చేయలేడా? 

రాష్ట్రంలోని ప్రజల ప్రాణాలను కాపాడేందుకు, రూ.1600 కోట్లు  ఖర్చు చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వెనుకాడుతున్నారంటే ఎవరైనా నమ్ముతారా? రోజుకు ఆరు లక్షల మందికి వ్యాక్సీన్లు వేయించిన ఘనత ఈ ప్రభుత్వానిది. వ్యాక్సిన్‌ కొందామంటే కూడా దొరకడం లేదు.

కేంద్రం గతంలో రాష్ట్రానికి ఒక లేఖ రాసింది. మేం వ్యాక్సిన్‌ వేసేందుకు విధి విధానాలు రూపొందించాం. కోవాక్జిన్, కోవిడ్‌ షిడ్‌ కొనుగోలు చేసేందుకు మీకు అవకాశం కల్పిస్తున్నామని గత నెలలో లేఖ రాసింది. దీంతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు లేఖలు రాసింది. మరి రెండు కంపెనీలకు సీఎం వైయస్‌ జగన్‌ లేఖలు రాశారు. భారత్‌ బయోటెక్‌ కంపెనీ రామోజీ కొడుకు వియ్యంకుడు. ఆ కంపెనీని చంద్రబాబు నేనే సృష్టించానని చెçప్పుకుంటారు. వాళ్లకు సీఎం లేఖ రాస్తే..ఇప్పటికీ 1.20 లక్షలు ఇచ్చాం. త్వరలోనే మీకు పంపిస్తామని మే 4న భారత్‌ బయోటెక్‌ వివరణ ఇచ్చింది.

సీరం కంపెనీ కూడా 9.91 లక్షల డోస్‌లు ఏపీకి ఇవ్వమని కేంద్రం చెప్పిందని, మే 3వ వారంలో ఇస్తామని మరో కంపెనీ లేఖ రాసింది. చంద్రబాబు ఎవరికి చెప్పకుండా సింగపూర్‌ నుంచి తెచ్చుకొని ఆయన ఇంటి వారికి వ్యాక్సిన్‌ వేయించారు. అలాగే రాష్ట్రంలో 4 కోట్ల మందికి డోస్‌లు తెప్పించవచ్చు కదా? . అందుకు అవసరమైన రూ.1600 కోట్లు మీకు పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. 40 రోజుల్లో వ్యాక్సిన్‌ ప్రక్రియను పూర్తి చేసే సత్తా మా ప్రభుత్వానికి ఉంది. 

వ్యాక్సీన్‌ కంపెనీలు కేంద్రం ఇచ్చిన నిర్దేశాలతో వ్యవహరిస్తుంటే..ఈ నలుగురు దుర్మార్గులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. జూమ్‌ యాప్‌లో చంద్రబాబు పిచ్చి కుక్కలా మెరుగుతున్నారు. కుల పిచ్చి, కుల గజ్జితో తప్పుడు వ్యవహారంతో ఉన్నారు.
ఇలాంటి వ్యక్తులను అరెస్టు చేయాలని బయట ప్రజలు కోరుతున్నారు. మీడియా, ప్రతిపక్షాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు,. వీరిని ఏం చేయాలి. వారిపై కేసులు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

కర్నూలులో కొత్త వేరియంట్‌ వచ్చచిందని చంద్రబాబు చెబుతున్నారు. ఎన్‌ 440 కే వచ్చిందంటున్నారు. కర్నూలులో కాదు..చిత్తూరు జిల్లాలో ఈ వెరియంట్‌ పుట్టింది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు సీబీఎన్‌ 420 అనేది నారావారిపల్లెలో పుట్టింది. 

 చంద్రబాబు, మీడియా ఏం కోరుకుంటున్నారంటే..రాష్ట్రంలో ఎక్కువ మందికి కరోనా రావాలి. రాష్ట్రానికి వ్యాక్సిన్‌ రాకుండా అడ్డుపడాలి. ఆసుపత్రుల్లో ఆక్సీజన్‌ సరఫరా ఆగిపోవాలి. శ్మశానాల్లో కెమెరాలు పెట్టి కరోనా కేసులుగా చూపించి మానసికంగా ఆనందం పొందాలి. ప్రజల్లో కొత్త అపోహాలు సృష్టించాలి..ఈ రకంగా చంద్రబాబు, ఆయన చుట్టు ఉన్నా మీడియా అధినేతలు కంకణం కట్టుకుని పని చేస్తున్నారు. 

చంద్రబాబు తన ఇంటి వాళ్లకే కోవిడ్‌ వ్యాSక్సిన్‌ వేయించుకున్నారు. కార్యకర్తలే మా పార్టీకి బలం అంటారే ..మరి వారికి కూడా వ్యాక్సీన్‌ వేయించవచ్చు కదా? ఎన్టీఆర్‌ కుటుంబానికి, ఆయన సొంత తమ్ముడు కుటుంబానికి వ్యాక్సిన్‌ ఎందుకు వేయించలేదు. ఇంట్లో దాక్కున్న చంద్రబాబుకు కరోనా రాదు. ఆయనకు పిచ్చి పరాకాష్టకు చేరింది. 

చంద్రబాబుకు రాబీస్‌ వ్యాక్సిన్‌ వేయించాలి. నీకు, నీ కుమారుడికి, నీకు డబ్బా కొడుతున్న మీడియా నేతలకు ఈ వ్యాక్సిన్‌ వేయిస్తే బాగుంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం కరోనాతో ఫైట్‌ చేయాలా? లేకపోతే దుర్మార్గులతో యుద్ధం చేయాలో అర్థం కావడం లేదు. ఒక్కటే చాలెంజ్‌ చేస్తున్నా..చంద్రబాబును సీఎంను చేసేందుకు రాష్ట్రం ఎటుపోయిన ఫర్వాలేదు అనుకుంటున్న వారికి సవాల్‌. మీకు దమ్ముంటే రోజుకు 10 లక్షల వ్యాక్సిన్‌ ఇప్పించండి. అందుకు అవసరమైన డబ్బులు మీకే ఇస్తాం. ఎంత డబ్బైనా ఫర్వాలేదు. మీ కమీషన్లు ఇచ్చేందుకు కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కోడు గుడ్డుపై ఈకలు పీకడం మానుకోండి. మీకుల నాయకుడిని సీఎం చేసేందుకో...సీఎం వైయస్‌ జగన్‌పై విష ప్రచారం చేయాలని చూస్తే..ఈ ప్రజలే మీకు గుణపాఠం చెబుతున్నారు.

ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో ప్రజలు ఎలా గుణపాఠం చెప్పారో చూశాం. నిమ్మగడ్డను అడ్డుపెట్టుకొని ఎన్నికలు తీసుకువచ్చి..ఈ పరిస్థితికి చంద్రబాబు కారణం కాదా? నిమ్మగడ్డ కాదా? ఎన్నికలు జరిగి తీరాల్సిందేనని పట్టుపట్టింది మీరు కాదా.తప్పుడు ప్రచారం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. వీళ్లపై కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుకుంటన్నారు. నేను కూడా సీఎం ఐవయస్‌ జగన్‌ను కోరుతున్నాను.

రేపు చంద్రబాబు జూమ్‌లో తన కుల సంఘంతో పిచ్చి స్టోరీలు అల్లుతున్నారు. జూమ్‌ యాప్‌లో వీరు కరోనాను ఆపుతారంటా? ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పిచ్చి మీటింగ్‌లు పెడుతున్నారు. వీటిపై కూడా నిఘా సంస్థలు కన్నేయాలి. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని లోపల వేయాలి. సీఎంపై విమర్శలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. బాధ్యతలు మరిచి పిచ్చి వాగుడు వాగితే ఎవరిని కూడా వదిలిపెట్టమని కోడాలి నాని హెచ్చరించారు. 
అచ్చెన్నాయుడు ఓ అంబోతు. దున్నపోతుకు ప్యాంట్‌ వేస్తే అది అచ్చెన్నాయుడు. లోకేష్‌ పెద్ద వేధవ అని అచ్చెన్నాయుడే చెప్పారు. మీడియా కోసం పిచ్చి కుక్కల మొరుగితే ఎవరు పట్టంచుకుంటారు. పైల్స్‌ ఆపరేషన్‌ చేయిస్తేనే రెండు నెలలు ఆసుపత్రిలో ఉన్నారు. అచ్చెన్నాయుడికి ట్రిట్‌మెంట్‌ సరిపోలేదు. వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్సలు అందించాలి.

మేం మోదీ ప్రభుత్వాన్ని ఎక్కడా తప్పుపట్టలేదు. వ్యాక్సిన్‌ ప్రక్రియ కేంద్రం పరిధిలో ఉంటుంది. మాపై ఎందుకు ఏడుస్తారని ప్రతిపక్షానికి చెప్పామే కానీ, కేంద్రాన్ని ఏమీ అనలేదు. అందరం కలిసి సమష్టిగా ఎదురుకుందామని సీఎం వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పని చేస్తే కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు. 70 ఏళ్లు వయసు వచ్చిన చంద్రబాబుకు కూడా ఇదే చెబుతున్నాం. వ్యాక్సిన్‌ ఎలా ఉత్పత్తి చేయాలో సలహాలు ఇస్తే బాగుంటుంది. బీజేపీకి మేం ఆలయన్స్‌ కాదు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా ఇదే చెప్పేవాళ్లం. సమష్టిగా ఎదుర్కొంటే కరోనాను కట్టడి చేయగలమని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top