గుడివాడలో నన్ను ఓడించలేకే లేనిపోని ప్రచారం

మంత్రి కొడాలి నాని 

విజయవా:  గుడివాడలో నన్ను ఓడించలేకే లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గుడివాడలో క్యాసినో అంటూ టీడీపీ చీర్‌ బాయ్స్‌ అల్లరి చేశారు. 3 రోజుల్లో గుడివాడలో క్యాసినోకు రూ.500 కోట్లు వచ్చాయంటున్నారు. 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు రావాలి.   స్థానిక టీడీపీ నేతలు కూడా పట్టించుకోని విషయాన్ని  టీడీపీ చీర్‌ బాయ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం అవివేకమన్నారు. గుడివాడలో క్యాసినో వ్యవహారంపై బైడెన్‌కు కూడా ఫిర్యాదు చేస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీకి జీవితకాలం టైం ఇస్తున్నా..వారికి చేతనైంఇ చేసుకోవచ్చు అని మంత్రి కొడాలి నాని సవాలు విసిరారు.

పాదయాత్రలో ఇచ్చని హామీ ప్రకారం కొత్త జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రి కొడాలి నాని ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం గుడివాడలో ఎన్టీఆర్‌ విగ్రహానికి మంత్రి నాని పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టారు. ఇది హర్షించదగిన విషయం. ఎన్టీఆర్‌ అభిమానుల తరపున సీఎం జగన్‌కు పాదాభివందనం చేస్తున్నామని అన్నారు.

అయితే కొందరు టీడీపీ నేతలు దీనిని కూడా రాజకీయం చేస్తున్నారు. దీనినిబట్టి ఎన్టీఆర్‌పై వారు ఎంత ద్వేషంతో ఉన్నారో ఇప్పుడే అర్థమవుతోంది. ప్రతిపక్షం ఎప్పుడూ కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. అయితే చంద్రబాబు మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.

Back to Top