ఈనెల‌ 17 నుంచి రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

విజయవాడ: సబ్సిడీపై రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈనెల 10వ తేదీ నుంచి రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని సూచించారు. మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి వైయస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జూన్‌ 17 నాటికి విత్తనాల పంపిణీ పూర్తి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారని గుర్తుచేశారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా విత్తనాల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రైతుల నుంచే విత్తనాలు తీసుకొని.. ప్రాసెసింగ్‌ చేసి మళ్లీ రైతులకే అందిస్తున్నామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా గ్రామాల్లోనే ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top