అమ్మ ఒడి పుట్టిన ప్రతి బిడ్డకు తొలి బడి

మంత్రి కన్నబాబు
 

అసెంబ్లీ: అమ్మ ఒడి పుట్టిన ప్రతి బిడ్డకు తొలి బడి అని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో అమ్మ ఒడి పతకంపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరక్షరాస్యతను పారద్రోలేందుకు అమ్మ ఒడి పథకాన్ని పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు మా ప్రభుత్వం అందజేస్తోంది. అమ్మ ఒడి పథకంలో రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షలకు పైగా లబ్ధిదారులను గుర్తించాం. అమ్మ ఒడితో సంక్రాంతి కంటే ముందుగానే మాకు పండగ వచ్చిందని తల్లులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీస్‌ మీడియం బోధన దేశంలో ఎక్కడా లేదు. విద్యారంగంలో గొప్ప సంస్కరణలు తీసుకువస్తున్నాం. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. స్వయంగా సీఎం మధ్యాహ్న బోజన మెనూను రూపొందించారు. ఈ రోజు నుంచే అన్ని పాఠశాలల్లో కొత్త మెనూ అమలు అవుతోంది. విద్యారంగంలో సీఎం వైయస్‌ జగన్‌ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దేశ చరిత్రలో ఇలాంటి సంస్కరణలను ఏ రాష్ట్రం చేయలేదు. సీఎం వైయస్‌ జగన్‌ చెప్పినదానికంటే ఎక్కువగా ఇస్తున్నారు. దాదాపు అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో బోధన ఉంటుంది.

Back to Top