సమర్థులక సముచితమైన పోస్టులు ఇచ్చాం

వ్యవసాయ శాఖామంత్రి కన్నబాబు
 

ప్రభుత్వం ఇప్పటి వరకూ ఇచ్చింది 224 కన్సల్టెంట్లు మాత్రమే. అవన్నీ ఒకే సామాజిక వర్గానికి అనేది కేవలం అబద్ధపు ఆరోపణ. నందమూరి లక్ష్మీ పార్వతి, రాజీవ్ కృష్ణ, వాసిరెడ్డి పద్మ, జక్కంపూడి రాజా ఇలా ఎంతో మందికి ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఓ ఎస్సీ మహిళలను నియమించిన ఘనత సీఎం వైయస్ జగన్ గారిది. కన్వీనర్లుగా నియమించుకునే వాళ్లను కులం చూసి నియమించుకోవడం టీడీపీ పద్ధతి. కానీ మా పద్ధతి అది కాదు. ఆయా రంగాల్లో నిపుణులు ఉంటారో, సమర్థగల వారుంటారో వాళ్లను ఎంపిక చేసుకుని వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటారు. అవి కూడా శ్వాశ్వతమైన పోస్టులు కాదు. అవి కాల పరిమితిలోబడి ఉంటాయి. ఒకే సామాజిక వర్గం వారికి అడ్వైజరీ పోస్టులు అంటూ తమకు అనుకూలంగా ఉన్న పేర్లను మాత్రమే చెబుతూ విమర్శిస్తున్నారు. కానీ ఇప్పుడు కొనసాగుతున్న ఎడ్వైజర్లలో గత ప్రభుత్వం నియమించిన వారుకూడా ఉన్నారు. వ్యవసాయ శాఖలో టి.విజయ్ కుమార్ IAS(రిటైర్డ్)ఉన్నారు. ఆయన్ను గత ప్రభుత్వమే నియమించింది. కులాలూ మతాలూ చూసే పద్ధతే ఉంటే 151 సీట్లు జగన్ గారికి వచ్చేవే కావు. దేవాదాయ కమిటీలు మొదలు, మార్కెట్ కమిటీల దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం అవకాశం ఇచ్చారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా వారికి సమాన ప్రాధాన్యం ఇస్తూ 50% కేటాయించారు.
ఏపీ హైయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమీషన్ కి జస్టిసి వి.ఈశ్వరయ్య గారిని నియమించారు. ప్రొ.లక్ష్మమ్మ, భార్గవరామ్ వీళ్లంతా వేరు వేరు సామాజిక వర్గాల వారే. బీసీలు జడ్జిలుగా పనికిరారు అంటూ ఓ జస్టిస్ ని అవమానించిన చరిత్ర టీడీపీది. గత ప్రభుత్వం పూర్తిగా కన్సల్టెంట్లగా వారికి కావాల్సిన వారిని, బంధువులను, అనుయాయులను నియమించుకున్నారు.
బంధుప్రీతి, కులప్రీతి, ప్రాంతీయ ప్రీతి ఎవరికున్నాయని అడిగితే ఎవరైనా టీడీపీ పేరే చెబుతారు. ఈ ప్రభుత్వం అవసరం మేరకే అడ్వైజర్లను నియమించుకుంది.

జక్కం పూడి రాజా - కాపు కార్పొరేషన్ ఛైర్మన్
జస్టిస్ ఎ.శంకర్ నారాయణ - పర్మినెంట్ ఏపీ కమీషన్ ఫర్ బీసీస్ ఛైర్‌పర్సన్
ఆర్కే రోజా - ఛైర్‌పర్సన్ ఏపీఐఐసి
రాజీవ్ కృష్ణ - అడ్వైజర్
కృష్ణా జివి గిరి - అడ్వైజర్
శ్రీధర్ లంకా - అడ్వైజర్
అప్పసాని కృష్ణారావ్ - అడ్వైజర్
వెంకటరమణీ భాస్కర్ - అడ్వైజర్ ఫైనాన్స్ అండ్ రీసోర్స్
బి. చంద్రశేఖర్ రెడ్డి - ఛైర్మన్ ఏపీ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
వెంకట్ చెంగవల్లి -
శిల్పా చుక్కపల్లి -
నందమూరి లక్ష్మీ పార్వతి - ఏపీ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
వీరందరి లిస్టు కావాలంటే చూసుకోవచ్చు. 

Read Also: వైయస్‌ఆర్‌ అకాల మరణంతో కరకట్ట పనులు ఆగిపోయాయి

తాజా ఫోటోలు

Back to Top