బాబు డ్రామా వేదిక ఏపీ నుంచి ఢిల్లీకి మార్పు

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏమి చేసినా..చెప్పి చేస్తున్నారు

చంద్రబాబు ప్రతి దాన్ని రాజకీయం చేస్తున్నారు

అక్రమాస్తులను కాపాడుకోవడం కోసమే  బాబు కృత్రిమ ఉద్యమం 

ప్రజాభిష్టం మేరకు ప్రభుత్వం పని చేయకూడదా? 

మంత్రి కన్నబాబు

సచివాలయం: అక్రమాస్తులను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు అమరావతి ప్రాంతంలో కృత్రిమ ఉద్యమం సృష్టించారని మంత్రి కన్నబాబు విమర్శించారు. ఈ డ్రామాను ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఢిల్లీకి మార్చాలని టీడీపీ ఎంపీలకు బాబు దిశా నిర్దేశం చేయడం సిగ్గు చేటు అన్నారు. బాబూ..నీ డ్రామాలు, కుట్రలు ఇక చాలని, ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. సచివాలయంలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు పార్లమెంట్‌లో రాజకీయ లబ్ధి కోసం తప్ప..వేరే విషయాలపై మాట్లాడలేదు. ఇవాళ అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని  ప్రజల నుంచి వచ్చిన చర్చను ఒక ప్రామాణికంగా తీసుకొని సీఎం వైయస్‌ జగన్‌ కమిటీలు వేసి వికేంద్రీకరణ జరగాలని ఒక నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబు ప్రతీదాన్ని రాజకీయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏమి చేసినా..చెప్పి చేస్తున్నారు. చంద్రబాబులాగా రహస్యంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. చంద్రబాబు తన అక్రమాస్తులను కాపాడుకోవడం కోసమే  అమరావతి ప్రాంతంలో కృత్రిమ ఉద్యమం చేపట్టారు. చంద్రబాబు మండలి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. వికేంద్రీకరణ, మండలి రద్దు పార్లమెంట్‌లో అడ్డుకోవాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు సూచిస్తున్నారు.  గతంలో కూడా చంద్రబాబు రాజకీయ అవసరాల కోసమే పార్లమెంట్‌లో ఎంపీలతో చంద్రబాబు మాట్లాడించారు. వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా?. ప్రజల పట్ల చంద్రబాబుకు కనీస బాధ్యత ఉందా?. భూములు, కబ్జాలు చేయడం టీడీపీకి అలవాటు.
మండలి ఏ రకంగా కూడా ఉపయోగంగా లేదని ఆ రోజు ఎన్టీఆర్‌ రద్దు చేశారు. ఇదే సభను వైయస్‌ఆర్‌ పునరుద్ధరించే సమయంలో చంద్రబాబు ఏం మాట్లాడారో ప్రజలు మరిచిపోయారా? మళ్లీ ఇప్పుడు ప్లేట్‌ ఫిరాయించి మండలి అవసరం అంటున్నాడు. మండలి ఇప్పుడు లోకేష్‌కు మాత్రమే అవసరం. లోకేష్‌ మంగళగిరిలో ఓడిపోయారు. అప్పుడే నైతిక బాధ్యత వహించి ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలి. ఆ రోజు పీడీఎఫ్‌, బీజేపీ సభ్యులు మండలిలో ఎంత అవేదన చెందారో కళ్లారా చూశాం. మూడు రాజధానులు, అమరావతిని చంద్రబాబు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కమిషన్ల ఏర్పాటు, ఇంగ్లీష్‌ మీడియంకు సంబంధించి శాసనసభలో ఆమోదం తెలిపిన టీడీపీ సభ్యులు ..మండలిలో ఎందుకు అడ్డుకున్నారు. కేవలం రాజకీయ అవసరాల కోసమే ప్రతి బిల్లుకు మోకాలడ్డుతున్నారు. ప్రజలు చూస్తూ ఊరుకోవాలా?. ప్రజాభిష్టం మేరకు ప్రభుత్వం పని చేయకూడదా? చేసిందంతా చేసి మళ్లీ ఢిల్లీలో డ్రామాలు ఆడాలని మీ ఎంపీలకు హితభోద చేస్తారా?. ఢిల్లీలో కాదు..ఎక్కడ డ్రామాలు చేసినా ప్రజలు మిమ్మల్ని ఛీకొట్టడం ఖాయం. ఎవరి పట్ల టీడీపీకి కమిట్‌మెంట్‌ లేదు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని ప్రచారం చేస్తున్నారు.  ఇలాంటి కృత్రిమ పోరాటాలను రాజకీయ అవసరాల కోసమే. ఇలా ఎంతకాలం పబ్బం గడుపుకుంటారు. ఇప్పటికైనా సరే కొంచమైనా రాష్ట్ర ప్రజల కోసం రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచన చేయాలి. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు హుందాగా ప్రవర్తించాలి. ఈ ప్రభుత్వంపై బురద జల్లె కార్యక్రమం, సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు ఇక చాలు చంద్రబాబు..మళ్లీ మీ డ్రామా వేదికను ఏపీ నుంచి ఢిల్లీకి మార్చితే ప్రజలు నవ్వుకుంటున్నారు. గతంలో ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అని డ్రామాలు ఆడింది ప్రధాని మోదీకి తెలియదా? రాష్ట్ర ప్రజలు చూడలేదా?. చంద్రబాబు ఇలాంటి కుట్ర పూరిత రాజకీయాలు ఆపేయండి. 

Back to Top