నెల్లూరు: వ్యవస్థలను మేనేజ్ చేయకపోతే.. చంద్రబాబుకు ఎప్పుడో 15 ఏళ్ళు జైలు శిక్ష పడి ఉండేదని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.చంద్రబాబు అధికారాన్ని అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడ్డాడు. చంద్రబాబు ప్రజాధనాన్ని దోచుకున్న తీరుపై సాక్ష్యాధారాలతో సహా సీఐడీ కోర్టు ముందు ఉంచటం జరిగింది. కోర్టు సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత చంద్రబాబుకు రిమాండ్ విధించిందని తెలిపారు. ఆదివారం మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిపై దుష్ప్రచారమా? - గత కొద్దిరోజులుగా సీఐడీని, ప్రభుత్వాన్ని నిందించటం, చివరకి వాదించిన న్యాయవాదుల్ని, తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులను నానా రకాలుగా డిబేట్స్ పెట్టి తిట్టించడం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. 14 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరించి రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేయటం దుర్మార్గం. ఓటుకు నోటు కేసులో అరెస్టు చేస్తారనే ఏపీకి చంద్రబాబు వచ్చాడు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా చంద్రబాబు దొరికిపోయాడు. దీంతో తెలంగాణ నుంచి ఏపీకి పలాయనం చిత్తగించాడు. ఏపీకి వచ్చి నవ్యాంధ్రలా తీర్చి దిద్దుతానని బీరాలు పలికి.. అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశాడు. 2014-19 పరిపాలన చూసిన ప్రజలెవ్వరూ చంద్రబాబు అరెస్టు తర్వాత వీధుల్లోకి రాలేదు. ఏపీలో చంద్రబాబుకు పరపతి లేదు. చంద్రబాబు దొంగలా ఏపీ కి పారిపోయి వచ్చి, తెలంగాణలో పరపతి ఉందని ఎల్లో మీడియా చెప్పదల్చుకుంది. అమెరికాలో జరిగింది.. ఆఫ్రికాలో జరిగింది కాదు. హైదరాబాద్‌లో కొంతమంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు రోడ్డు మీద ఆందోళన చేస్తున్నారట. 2014-19లో చంద్రబాబు దోచుకున్నారని ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టే రాష్ట్రంలో ప్రజలెవ్వరూ నిరసనల్లో పాల్గొనటం లేదు. చంద్రబాబు అరెస్టును పట్టించుకోవట్లేదు. చంద్రబాబు అరెస్టును సీరియస్‌గా పరిగణించట్లేదు. చివరకు ధర్నాలు, నిరసనల్లోనూ టీడీపీ శ్రేణులు స్పందించట్లేదంటేనే చంద్రబాబు, టీడీపీ పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. *లోకేశ్ ఢిల్లీ యాత్ర అట్టర్ ఫ్లాప్* చంద్రబాబు కొడుకు లోకేశ్ ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయిలో ఏపీలో ఏమి జరిగిందో వివరిస్తాడని అన్నారు. అందరూ అనుకున్నట్లుగానే లోకేశ్‌ను ఢిల్లీలో పట్టించుకున్నవారే లేరు. ఇక్కడ తెలుగులో మాట్లాడినట్లే ఢిల్లీలోనూ అదే అరకొర జ్ఞానంతో లోకేశ్ మాట్లాడారు. జాతీయ మీడియా ప్రశ్నలకు లోకేశ్ ఏమీ చెప్పలేకపోయాడు. చంద్రబాబును ఎలా జైలు నుంచి బయటకు తీసుకురావాలని లోకేశ్ ఢిల్లీ యాత్ర చేశాడు. దాని కోసం ఏ లాయర్లను కలవాలో ఢిల్లీలో లోకేశ్ తిరుగుతున్నాడు. *ఢిల్లీలో న్యాయవాదుల చుట్టూ తిరుగుతున్న లోకేశ్* రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం జగన్ గారు ఢిల్లీ పర్యటన చేస్తే.. రకరకాలుగా టీడీపీ నాయకులు ఆపాదిస్తారు. మరి, ఈరోజు లోకేశ్ ఢిల్లీ పర్యటన చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయమని కోరటానికే అని అందరికీ స్పష్టంగా అర్థమైంది. అడ్వకేట్లను కలవటం, నాయకుల దగ్గరకు వెళ్లి కాళ్ల మీద పడి కేసు నుంచి చంద్రబాబును బయటకు తీసుకురావాలనేది లోకేశ్ అజెండా. స్కిల్ స్కామ్ లో లోకేశ్ అవినీతికి పాల్పడ్డాడని చంద్రబాబు కుటుంబమే భావిస్తోంది చంద్రబాబు అరెస్టు మీద రోజుకో మాట టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిన్న చంద్రబాబు కుటుంబ సభ్యులు మాట్లాడారు. లోకేశ్‌ను కూడా అరెస్టు చేస్తారేమో అని భార్య బ్రాహ్మణి కూడా మాట్లాడింది. ఈ అరెస్టు భయం ఎందుకు వచ్చిందంటే జరిగిన విషయం కుటుంబ సభ్యులకు తెలుసు కాబట్టి. ఒక్కొక్కరుగా ఇది మన మెడకు చుట్టుకుంటుందని కుటుంబ సభ్యులు కూడా భయపడుతున్నారు. జరిగినవన్నీ సీఐడీ విచారణలో బయటపడుతున్నాయి. బ్రీఫ్ కేసులు మోసుకొచ్చిన విషయం.. మీరు లెక్కబెట్టిన విషయం కుటుంబ సభ్యులు చూశారు కాబట్టే.. వాళ్లకు అవినీతి జరిగిందని తెలుసు. అందుకే చంద్రబాబుతో పాటు లోకేశ్ కూడా లోపలికి పోతారనే భయం ఉంది కాబట్టే కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్నారు. రాజమండ్రి జైల్ సూపరింటెండెంట్ రాహుల్ సెలవునూ వక్రీకరిస్తారా? రాజమండ్రి జైల్ సూపరింటెండెంట్ రాహుల్ భార్య అనారోగ్యం పాలైంది. దీంతో జైల్ సూపరింటెండెంట్ రాహుల్ సెలవు మీద వెళ్తే ఎల్లో మీడియాలో వక్రీకరించి చూపించారు. చివరికి జైల్ సూపరింటెండెంట్ భార్య అనారోగ్యంతో మృతి చెందారు. తర్వాత పచ్చ మీడియా ఎలా రాస్తోందో ప్రజలకు అర్థమైంది. సూపరింటెండెంట్ భార్య అస్వస్థతతో సెలవు పెడితే.. ప్రభుత్వానికి ముడిపెడుతూ పచ్చ మీడియా దిగజారిపోయింది. ఇంతకంటే.. దౌర్భాగ్య పరిస్థితులు మరొకటి ఉండదు. పవర్ స్టార్ కాస్త ప్యాకేజీ స్టార్ అయిపోయాడు. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తానని చంద్రబాబు తన నైపుణ్యంతో డబ్బులు కొట్టేశాడు. నిర్మాతల దగ్గర రెమ్యునరేషన్ తీసుకుని కెమెరా ముందు నటించే పవన్ కల్యాణ్ చంద్రబాబు దగ్గర ప్యాకేజీలు తీసుకుని ప్రజల దగ్గర మాట్లాడుతున్నాడు. తేడా ఏమీ లేదు. సంస్కారం ఉన్నవాడు ఎవడైనా జైలులో డీల్ మాట్లాడుకుంటారా? చంద్రబాబు, లోకేశ్ మీద నమ్మకం లేదని బాలకృష్ణను మధ్యవర్తిగా పెట్టుకుని పవన్ జైలులో డీల్ మాట్లాడుకున్నాడు. 2014-19 చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డాడని పవన్ కళ్యాణ్ నాడు చెప్పాడు. చంద్రబాబుకు మద్దతు ఇస్తే లోకేశ్ తన తల్లిని దూషించారని, వారి అంతు చూస్తానని పవన్ అన్నాడు. ఇప్పుడు చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తానని చెబుతున్నాడు. జనం అంతా జగన్ వెంట ఉంటే.. జనసేనాని చంద్రబాబుతో పోయాడు. పైగా నాలుగు శాతం కూడా ఓట్లు లేని పవన్ కల్యాణ్. .. వైఎస్‌ఆర్‌సీపీని అడ్డుకుంటానని చెప్పడం ఏమిటి? బలం, బలగం ఉంటే పవనే అధికారంలోకి వచ్చి ఉండేవాడు. పవన్ కల్యాణ్‌కు రాజకీయ పరిణితి లేదని అర్థమౌతోంది. పవర్ స్టార్ కాస్త ప్యాకేజీ స్టార్ అయిపోయాడు. రాజ్యాంగ వ్యవస్థలను టీడీపీ అవమానించడం సరికాదు - కోర్టుల నుంచి సాంకేతిక కారణాలతో చంద్రబాబు స్టేలు తెచ్చుకొని కొనసాగుతున్నాడు. లేకపోతే చంద్రబాబు చేసిన అవినీతికి ఎప్పుడో 15 ఏళ్ల జైలు శిక్ష పడాల్సి ఉండేది. వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబు దిట్ట. సీఐడీ అన్ని ఆధారాలతో కోర్టు ముందు ఉంచింది. చివరికి సోమిరెడ్డి లాంటి వ్యక్తులు కూడా చంద్రబాబు పని అయిపోయిందంటున్నారు. చంద్రబాబు మీద ఆధారాలున్నా.. శిక్ష వేయకూడదు.. శిక్షిస్తే.. మాత్రం న్యాయమూర్తులను, న్యాయవాదులను వదలము అని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. దోషి అయిన చంద్రబాబును నిర్దోషిగా చూపించాలనే తపనతో రాజ్యాంగాన్ని టీడీపీ నాయకులు ఉల్లంఘిస్తున్నారు. - నా పాలనలో మీకు మేలు జరిగితే ఓటు వేయండని అడగగలిగిన ధీరుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. నాకు ఓటేయండని అడగకుండా.. ఎవరో ఒకరితో పొత్తుకు వెళ్లి వాళ్ల భుజాల మీద ఎక్కి ఊరేగుదామన్నది చంద్రబాబు సిద్ధాంతం. అధికారంలోకి వచ్చి ప్రజాసొత్తు దోచుకుని ప్యాకేజీలు పంచుకోవాలన్నది టీడీపీ ఆలోచన. పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అని ప్రజలు నమ్ముతున్నారు. విచారణకు సహకరించి చంద్రబాబు వాస్తవాలు చెప్పాలి. రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా లూటీ చేశాడో రాబోయే రోజుల్లో తేటతెల్లం అవుతుంది.