ఫైబర్‌ గ్రిడ్‌లో అవినీతిపై విచారణ

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌
 

అమరావతి: గత ప్రభుత్వ హయాంలో ఫైబర్‌ గ్రిడ్‌లో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా కమ్యూనికేషన్‌ వ్యవస్థను చంద్రబాబు తన చేతిలో పెట్టుకున్నారని విమర్శించారు. ఫైబర్‌ గ్రిడ్‌ కేబుల్‌ డ్యామేజ్‌అయితే నాన్‌బెయిల్‌ కేసులు పెట్టమని చంద్రబాబే స్వయంగా చెప్పారన్నారు. గతంలో ఏ స్కీమ్‌ చూసినా వేల కోట్ల అవినీతే కనబడుతుందన్నారు.  
 

Back to Top