ట్రిబ్యున‌ల్ నిబంధ‌న‌ల  ప్ర‌కారమే వైఎస్సార్ న‌డుచుకున్నారు

- అసెంబ్లీలో మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ ఇచ్చిన తీర్పు అర్థంకాక టీడీపీ రాద్ధాం చేయ‌డం మానుకోవాలి. గతంలో తొమ్మిదేళ్లు ముఖ్య‌మంత్రిగా చేసిన చంద్ర‌బాబు సాగునీటి ప్రాజెక్టుల‌ను ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్సార్ ముఖ్య‌మంత్రి కాగానే ప్రాజెక్టుల అవ‌స‌రాన్ని గుర్తించారు. కృష్ణా, గోదావ‌రి మిగులు జ‌లాల‌పై ప్రాజెక్టులు క‌ట్టాల‌ని నిర్ణ‌యిస్తే మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క రాష్ట్రాలు కోర్టుకెళ్లాయి. బచావ‌త్ తీర్పును ఉల్లంఘించారని బ్రిజేష్ ట్రిబ్యున‌ల్‌కి ఫిర్యాదు చేస్తే.. ప్రాజెక్టులు ఆగిపోకూడ‌ద‌ని నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌కుండా ఆంధ్రా ప్రాజెక్టుల నిర్మాణం జ‌రుపుకుంటామ‌ని అంగీక‌రించారు. దీనివ‌ల్ల రాష్ట్రానికి లాభ‌మే తప్ప న‌ష్టం జ‌ర‌గ‌లేదు. బ్రిజేష్ ట్రిబ్యున‌ల్ తీర్పు ప్ర‌కారం మిగులు జ‌లాల‌పై హ‌క్కు మ‌న‌కు లేద‌నే విష‌యం ప్ర‌తిప‌క్ష స‌భ్యులు గుర్తించాలి. దీనిపై ఇంట‌ర్ లొకేట‌రీ అప్లికేష‌న్ కు అంగీక‌రించాం. గాలేరు-న‌గ‌రి, హంద్రీనీవా, వెలిగొండ స‌హా మొత్తం ఐదు ప్రాజెక్టుల నిర్మాణం ఊపందుకుంటే అదంతా వైఎస్సార్ చొర‌వే కార‌ణ‌మ‌ని ప్ర‌తిప‌క్షం మ‌రిచిపోయింది. 

Read Also: సీమ ప్రాజెక్టులపై చంద్రబాబు సమాధానం చెప్పాలి

తాజా ఫోటోలు

Back to Top