సీమ ప్రాజెక్టులపై చంద్రబాబు సమాధానం చెప్పాలి

ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
 

అసెంబ్లీ: రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. సీమ ప్రాజెక్టులపై ఎమ్మెల్యే సభలో మాట్లాడారు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఈ ప్రాంతం వ్యక్తులు కాకుండా వేరే ప్రాంతం సభ్యులు అడుగుతుంటే అవమానంగా ఉంది. ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టు ఉందో వారికి తెలుసా? ఈ రోజు టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబే సమాధానం చెప్పాలి. గండికోటలో నీరు ఎందుకు పెట్టలేదని అడుగుతున్నారు. మీరు భూ సేకరణ చేసి ఉంటే, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ  ఇచ్చి ఉండి ఉంటే నీరు నిల్వ చేసే వారు. వైయస్‌ జగన్‌ మే నెలలో సీఎం అయ్యారు. భూ సేకరణ చేయాలంటే ఆరు నెలలు పడుతుంది. ఈ విషయం చంద్రబాబుకు తెలియదా? బ్రహ్మంసాగర్‌కు ఆగస్టు నుంచి నీరు వస్తోంది. ఎందుకు తక్కువ వస్తోందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఆయన కాల్వలు మరమ్మతులు చేపట్టకపోవడంతో నీరు తక్కువగా వస్తోంది. బ్రహ్మంసాగర్‌కు ఐదు టీఎంసీలు మీ ఐదేళ్లలో నీరు పెట్టారా?. మరమ్మతులు చేయాలని ఎన్నోసార్లు కోరినా పట్టించుకోలేదు. బ్రహ్మంసాగర్‌ కింద లక్ష యాభై వేల ఎకరాల ఆయకట్టు ఉంది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలి. 2008లో అప్పటి సీఎం వైయస్‌ఆర్‌ కృష్ణా జలాలను తెచ్చేందుకు శంకుస్థాపనలు చేశారు. టెండర్లు పిలిచే దశలో మహానేత మరణించారు. చంద్రబాబు కడపకు వచ్చే ముందు రైతులు ఆయన్ను కలిసేందుకు కడపకు వెళ్తే చంద్రబాబు పట్టించుకోలేదు. అరెస్టు చేయించారు. నీళ్లు ఇవ్వమంటే కేసులు పెట్టారు. రాయలసీమ గురించి మాట్లాడేందుకు ఒక్క టీడీపీ సభ్యుడు కూడా లేకపోవడం బాధగా ఉంది. సీమలో టీడీపీకి ముగ్గురు ఎమ్మెల్యేలనే ఇచ్చారు. మీరు రాయలసీమకు మేలు చేసి ఉంటే మీకు మద్దతుగా ఉండేవారు. ఏమీ చేయలేదు కాబట్టే ప్రజలు తీర్పు ఇచ్చారు. వైయస్‌ఆర్‌ పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు చేపట్టారు. ఆ రోజు టీడీపీ వ్యతిరేకించింది. దేవినేని ఉమా   ఆ రోజు ధర్నా చేశారు. నా వద్ద పేపర్‌ కట్టింగ్స్‌ ఉన్నాయి. రాయలసీమను అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన గత ప్రభుత్వం ఐదేళ్లు నిద్రపోయింది. ఈ రోజు టీడీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఈ రోజు మా ప్రభుత్వం ముగ్గురు ఆర్డీవోలను నియమించి, యుద్ధప్రాతిపాదికన పనులు చేపడుతున్నారు.

Read Also: సమర్థులక సముచితమైన పోస్టులు ఇచ్చాం 

తాజా వీడియోలు

Back to Top