గిరిజన సంక్షేమానికి చిత్తశుద్దితో కృషి చేసిన వైయస్ జగన్

ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో కొనియాడిన వైయస్ఆర్‌సీపీ గిరిజన నేతలు

వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

అంబేద్కర్, డాక్టర్ వైయస్ఆర్, గిరిజన పోరాట వీరులు గాం మల్లు దొర, బిర్సా ముండా, జైపాల్ సింగ్ ముండా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు

ఆదివాసీ ప్రాంతాల్లో విద్యా, వైద్యం, ఉపాధి రంగాల్లో సంస్కరణలు

వైయస్ జగన్ హయాంలో 3,22,670 ఎకరాల భూపంపిణీ 

ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేశారు

గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగ రక్షణకు రాజ్యాంగ సవరణకు చర్యలు 

చంద్రబాబు పాలనలో ఒక్క ఎకరా కూడా గిరిజనులకు భూపంపిణీ చేయలేదు

కనీసం అడ్వయిజరీ కమిటీ ఏర్పాటుకు కూడా చర్యలు లేవు

ఆదివాసీల పట్ల పూర్తి నిర్లక్ష్యంతో కూటమి సర్కార్

మండిపడ్డ వైయస్ఆర్‌సీపీ గిరిజన నేతలు

తాడేపల్లి: తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆదివాసీల హక్కుల కోసం కృషి చేసిన మహనీయులు అంబేద్కర్, డాక్టర్ వైయస్ఆర్, గిరిజన పోరాట వీరులు గాం మల్లు దొర, బిర్సా ముండా, జైపాల్ సింగ్ ముండా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్యెల్యే కె.భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎంపీ మాధవి, మాజీ ట్రైకార్ చైర్మన్ సురేంద్ర, మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు హనుమంత్ నాయక్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..

ఆదివాసీలకు అండగా నిలిచిన వైయస్ జగన్ :   ఎమ్మెల్సీ, డాక్టర్ కుంభా రవిబాబు

ప్రపంచంలోనే 47 కోట్ల మంది ఆదివాసీలు ఉంటే, మన దేశంలో 11 కోట్ల మంది ఆదివాసీలు ఉన్నారు. ఉమ్మడి ఏపీలో  2005లో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా తొలిసారి ఆదివాసీ దినోత్సవంను జరిపారు. ఆనాడు ఆయన ఆధ్వర్యంలో అటవీ హక్కుల చట్టం కింద 4 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగింది. ఆయన ఆశయాలన అందిపుచ్చుకున్న వైయస్ జగన్ సీఎంగా ఈ రాష్ట్రంలో అయిదేళ్ళపాటు ఆదివాసీల హక్కులు, వారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేశారు.  2014-19 వరకు సీఎంగా చంద్రబాబు పాలనలో ఒక్క ఎకరం కూడా అటవీ హక్కుల చట్టం కింద భూపంపిణీ జరగలేదు. 2019-24 లో సీఎంగా వైయస్ జగన్ పాలనలో అటవీ హక్కుల చట్టాన్ని బయటకు తీసి, దాదాపు 3,22,670 ఎకరాలను భూపంపిణీ చేశారు. నేడు కూటమి ప్రభుత్వంలో లక్ష ఎకరాల్లో కాఫీ సాగు చేయాలని సీఎం చంద్రబాబు ప్రకటిస్తున్నారు. ఆయన సీఎంగా కొనసాగిన గత అయిదేళ్ళలో రెండు లక్షల ఎకరాల్లో రూ.500 కోట్లతో కాఫీ సాగు చేస్తానని హామీలు ఇచ్చారు. కానీ ఒక్క ఎకరంలో కూడా సాగు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ లక్ష ఎకరాలు అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. పోడు వ్యవసాయం ద్వారా ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలి. కాఫీ, మిరియాలు, పిప్పళ్ళు వంటి సాగుకు ప్రభుత్వ చేయూతను కల్పించాలి. 

అరకు ఎమ్మెల్యే, రేగం మత్స్యలింగం

ఈ రాష్ట్రంలో 32 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఈ రోజుకూ కూటమి ప్రభుత్వం ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేయలేదు. రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్‌ను అమలు చేయాల్సిన అవసరం లేదా? గతంలో వైయస్ జగన్ సీఎంగా కేవలం రెండు నెలల్లోనే అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఒక గిరిజన ఎమ్మెల్యేకు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. జీఓ3 ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లోని ఉద్యోగాలను సంపూర్ణంగా వారికే అందించాలి. కానీ ఆ జీఓను కొందరు సుప్రీంకోర్ట్‌లో చాలెంజ్ చేస్తే దానిని కొట్టివేశారు. ఆనాడు సీఎంగా వైయస్ జగన్ రివ్యూ పిటీషన్ వేయించినా, సుప్రీంకోర్ట్ దానిని అంగీకరించలేదు. రాజ్యాంగ సవరణ ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆలోచన చేసిన నాయకుడు వైయస్ జగన్. దీనిని ట్రైబల్ అడ్వయిజరీ కమిటీలో ఆమోదింపచేసి, కేంద్రానికి పంపిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుంది. చంద్రబాబు ఎన్నిక సమయంలో జీఓ నెంబర్ 3ని పునరుద్దరిస్తానని, సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ విధానాల ద్వారా న్యాయం చేస్తామని అన్నారు. నేడు రాష్ట్రంలో 16వేల టీచర్ పోస్ట్‌లకు డీఎస్సీని ప్రకటిస్తే దానిలో గిరిజనులకు వచ్చేది కేవలం 6 శాతం మాత్రమే. గతంలో వైయస్ జగన్ హయాంలో చేసినట్లుగా రాజ్యాంగం 5వ షెడ్యూల్‌లోని క్లాజ్ 2 ని సవరించేందుకు ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ ద్వారా కేంద్రానికి సిఫారస్ చేశారో దానిని ముందుకు తీసుకువెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం. 

గిరిజన ప్రాంతాల్లో విద్యాకుసుమాలు :   మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు కె.భాగ్యలక్ష్మి

గిరిజన పక్షపాతిగా వైయస్ జగన్ తన పాలనలో అనేక సంస్కరణలను తీసుకువచ్చారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో గిరిజనులను ప్రోత్సహించారు. గిరిజన ప్రాంతాల్లో వెనుకబాటుతనంను పారద్రోలేందుకు పలు చర్యలు తీసుకున్నారు. పాడేరులో ఆదివాసీలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టారు. కురుపం నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేసి గిరిజన విద్యార్ధులకు ప్రోత్సాహాన్ని అందించారు. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయంను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి, మన్యంలో విద్యాకుసుమాలను ప్రోత్సహించారు. పోడు వ్యవసాయంపై ఆధారపడిన 1.30 లక్షల మంది గిరిజనులకు మూడు లక్షలకు పైగా ఎకరాలకు పట్టాలు ఇచ్చిన ఘనత వైయస్ జగన్ గారికే దక్కుతుంది. ఆయన హయంలో ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు విద్యా, ఉద్యోగ కల్పన, ఆరోగ్య పరిరక్షణక ఆయన పెద్దపీట వేశారు. భారతదేశ చరిత్రలోనే ఎవరూ ఊహించని విధంగా ఏపీలో ఆయన హయాంలో పలు సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను నిర్వహించారు.

Back to Top