పాలనలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం

ప్ర‌జ‌ల్లో అవి చర్చకు రాకుండా తెరపైకి మద్యం అక్రమ కేసు

ఎంతమందిని అరెస్టు చేసినా మా పోరాటం ఆగదు 

కూటమి ప్రభుత్వానికి తేల్చి చెప్పిన వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీ జే ఆర్ సుధాకర్ బాబు. 

తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు.

మద్యం కేసు చంద్రబాబు అల్లిన ఓ కట్టుకథ

15 నెలల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వం

ప్రజాగ్రహం నుంచి దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్

లేని లిక్కర్ స్కామ్ ను తెరపైకి తెచ్చి వరుస అరెస్టులు

లిక్కస్ కేసులో ఒక్క ఆధారమైనా చూపించారా

చంద్రబాబు ప్రభుత్వాన్ని సూటిగా నిలదీసిన టీజేఆర్ సుధాకర్ బాబు

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో పారదర్శక మద్యం పాలసీ

మద్యం నియంత్రణకే ప్రభుత్వ ఆధ్వర్యంలో అమ్మకాలు

బెల్లు షాపులు పూర్తిగా రద్దు చేసిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం

ధరలు పెరగడంతో మా పాలనలో మద్యం అందని ద్రాక్ష

ఒక్క కొత్త డిస్టలరీకి అనుమతి ఇవ్వని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం

స్పష్టం చేసిన సుధాకర్ బాబు

2014-19 మధ్య ఏపీలో ఏరులై పారిన మద్యం

బెల్టుషాపులు, పాన్ షాపులు, కిరణా దుకాణాల్లోనూ అమ్మకాలు

పేదల రక్తాన్ని జలగలా పీల్చిన బాబు సర్కారు

తిరిగి 2024 లోనూ మద్యం అమ్మకాలకు గేట్లు తెరిచిన చంద్రబాబు

ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే లేని లిక్కర్ కేసు

అక్రమ అరెస్టులు, జైలు శిక్షలు

బెయిల్ వచ్చినా విడుదలకు ఉద్దేశపూర్వక జాప్యం

వాస్తవాలు బయటపెట్టిన  టీజీఆర్ సుధాకర్ బాబు

మీ అక్రమ కేసులకు, అరెస్టులకు భయపడేది లేదు

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో మా పోరాటం ఆగేది లేదు

నీ తప్పిదాలకు తగిన శిక్ష పడే రోజు వస్తుంది

హెచ్చరించిన సుధాకర్ బాబు 

తాడేపల్లి:  పాలనలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, అవి ప్రజల్లో చర్చకు రాకుండా ఉండేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీ జే ఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.... రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించిన చంద్రబాబు... తమ అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే లేని లిక్కర్ కేసును తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. వంద అక్రమ మద్యం కేసులు బనాయించినా, వందలాది మందిని అరెస్టు చేసినా.. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం ఆగదని ఆయన హెచ్చిరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

● లిక్కర్ కేసు చంద్రబాబు అత్యుత్తమ కుట్ర:

సీఎం చంద్రబాబు లేని లిక్కర్ స్కామ్ లో అభూత కల్పనలతో ... వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సన్నిహితులను,  గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనంజయ్ రెడ్డి, ఓస్డీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు గోవిందప్పలను అక్రమంగా అరెస్టు చేశారు. ఈ అరెస్టులు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఆడిస్తున్న ఓ కట్టుకథ. ఇది ఓ అక్రమ కేసు. కేసులు బనాయించి రాష్ట్రంలో ప్రజలను భయబ్రాంతులను చేసి.. ప్రభుత్వ వైఫల్యాల వైపు ప్రజలు, నాయకులు, ప్రతిపక్షాలు చూడకుండా డైవర్షన్ చేయడంతో చంద్రబాబు దిట్ట. జరగని స్కామ్ జరిగినట్లు చెప్పడంతో పాటు తనకు నచ్చని వారందరి పైనా కేసు నమోదు చేస్తున్నారు. కేసుకు సంబంధం లేని అమాయకులు, పోలీసులను గుడ్డిగా నమ్మనవారు, కేసు పూర్వాపరాలు తెలియని వాళ్లు, చంద్రబాబు, లోకేష్ ల కుట్ర కోణం తెలియని వాళ్లు వాళ్ల ఉచ్చులో పడుతున్నారు. గతంలో ఏంపీ ఎండీసీ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి కూడా వీళ్ల ఉచ్చులో పడ్డారు. వీళ్ల బాగోతాలన్నింటినీ సోషల్ మీడియా బట్టబయలు చేస్తుంది.

● సిట్ దర్యాప్తును తప్పు పట్టిన కోర్టు

మరోవైపు కోర్టులు సైతం ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా ఎలా ఛార్జిషీట్ ఫైల్ చేస్తారని ప్రశ్నించింది. మద్యం కేసుకు సంబంధించి సెట్ దాఖలు చేసిన  ఛార్జ్ షీట్ లో కోర్టు 21 తప్పులు చూపించింది. సాంకేతక పరమైన, ధృవీకరించిన ఆధారం  ఒక్కటీ లేదని ప్రశ్నించింది. సిట్ దర్యాప్తు పూర్తిగా లోపభూయిష్టంగా మారింది.
సిట్ అధికారులను నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మాజీ ఐఏఎస్ ధనంజయ్ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలను కస్టడీలోకి తీసుకుని, 90 రోజుల పాటు వాళ్లను జైల్లో నిర్భంధించిన తర్వాత కూడా సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో లిక్కర్ కేసులో వీరికి సంబంధం ఉందని నిరూపించగలిగారా ? ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు జేబు సంస్థగా మారిపోయారు ? రాజకీయంగా విధానపరమైన, సాంప్రదాయ రాజకీయాలు చేయడానికి, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయకత్వంలో చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడానికి వైయ‌స్ఆర్‌సీపీకి ఎలాంటి భయం లేదు, అందుకే కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు ద్వారా భయపెట్టాలని చూస్తోంది. అందుకు సిట్ ను వాడుకుంటోంది. చివరకు మా కుటుంబాల దగ్గరకు రావడం ద్వారా మీరు ఘోరమైన తప్పిదం చేశారు. 

● మద్యాన్ని ఏరులై పారించిన చంద్రబాబు:

2014-19 మధ్య చంద్రబాబు హయాంలో తీసుకున్న మద్యం విధానాల వల్ల ఆ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఏరులై పారింది. ఊరూరా బెల్టుషాపులు, పాన్ షాప్ లు, కిరాణాదుకాణాల్లోనూ మద్యం అమ్మకాలు సాగించిన రోజులవి. మీ హయంలో ఎక్కడిబడితే అక్కడే మద్యం అమ్మకాలు సాగించిన దుర్మార్గ పాలన మీది.  దానిపైనే మా పోరాటం చేశాం. పాదయాత్రలో మా నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మా పార్టీ అధికారంలోకి వస్తే విడదల వారీగా మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మాటమీదే నిలబడి అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టుషాపులు రద్దు చేశాడు.  ఊరూరా, వాడవాడలా మద్యం అమ్మకాలకు తెరలేపి పేదల రక్తాన్ని జలగల్లా పీల్చే విధానం చంద్రబాబుదైతే... మద్యం నియంత్రణకు   చేపట్టిన మంచి సంస్కరణల్లో భాగంగా కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం అమ్మకాలు నిర్వహించిన ఘనత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిది.  మద్యం  వినియోగాన్ని నియంత్రించడానికి అందుబాటులో ఉండే విధానాన్ని తగ్గించడంతో పాటు రేటు కూడా పెంచి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మద్యాన్ని అందని ద్రాక్షగా చేస్తే... చంద్రబాబు మాత్రం ఉపాధి అవకాశాలను, విద్యను, ఉద్యోగాలను అందని ద్రాక్షగా చేశాడు.

మద్యం అక్రమ కేసు కేవలం చౌకబారు రాజకీయ ఎత్తుగడ మాత్రమే. వైయ‌స్ఆర్‌సీపీమద్యానికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అమ్మకాలు సాగించి వేల కోట్ల రూపాయాలు ప్రభుత్వానికి ఆదాయంగా తీసుకొచ్చిన చరిత్ర వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిది అయితే 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మాత్రం గతంలో వలే పూర్తిగా బెల్టుషాపులు యదేచ్చగా తెరిచాడు. చివరకు పాన్ షాపుల్లోనే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. చౌకబారు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. దాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిచూపడంతో భరించుకోలేక దాన్నుంచి తప్పించుకోవడానికి మీరు వేసిన కుప్పి గెంతే ఈ లిక్కర్ స్కామ్.

● వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో పారదర్శకంగా మద్యం అమ్మకాలు

మద్యం కేసుపై కూటమి ప్రభుత్వం సిట్ నియమించే ముందు.. గత ప్రభుత్వంలో మద్యం స్కామ్ జరిగిందనుకుంటే... దానికి సంబంధించి రావాల్సిన ఆదాయం రాలేదు అనో, అక్రమంగా డిస్టలరీలకు పర్మిషన్ ఇచ్చారనో ఒక్కచోట కూడా చెప్పలేదు. కారణం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్టలరీలకు అనుమతి ఇచ్చించే నారా చంద్రబాబునాయుడు, కాదంటే దీనిమీద చర్చకు సిద్దమా ? ఒక్క మద్యం తయారీ డిస్టలరీకి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనుమతి ఇవ్వలేదు. మరి స్కామ్ ఎక్కడ జరిగింది ? వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు ఈ మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం వచ్చిందో చెప్పమని మేము చాలా కాలం నుంచి అడుగుతున్నాం. నిన్న కోర్టు సైతం ఇదే విషయాన్ని అడిగినా ఈ ప్రభుత్వానికి సిగ్గురాలేదు. సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో లోపాలున్నాయని  21 అంశాలపై కోర్టు అడిగిన ప్రశ్నలకు మీరు ఎందుకు సమాధానం చెప్పరు? ప్రజలకు, న్యాయస్థానాలకు మీరు సమాధానం చెప్పాల్సిందే. పారిపాతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సంబంధం లేనివారిని కూడా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చుట్టూ ఉన్న వారని అరెస్టు చేసి జైల్లో పెట్టి నీ అధికార జులుం ప్రదర్శించావు. ఇది చరిత్ర, మరలా ఇది తిరిగి నీ దగ్గరకు వస్తుందన్న విషయాన్ని రాసిపెట్టుకో చంద్రబాబూ. నువ్వూ, నీ కొడుకూ చేస్తున్న వికృత రాజకీయాలు సహేతుకం కాదు. 

● బెయిల్ కోసం చంద్రబాబు పచ్చి అబద్దాలు

చంద్రబాబు అదే జైల్లో ఉన్నప్పుడు నా పక్కన డ్రగ్స్ సేవించేవాళ్లు, మద్యం తాగేవాళ్లు ఉన్నారు వారి నుంచి రక్షణ కావాలి, బెయిల్ కావాలని కోరితే... ఆయన విజ్ఞప్తి మేరకు బ్యారక్ అంతా ఆయనకే కేటాయించారు. పక్క బ్యారక్ లో డెంగ్యూ తో చనిపోయారు, నాకూ వచ్చే ప్రమాదం ఉందని ఒకసారి, నా ఒళ్లంతా దద్దుర్లు, పుండ్లు ఉన్నాయి కాబట్టి బెయిల్ కావాలని మరోసారి, నాకు గుండెపోటు అని ఇంకోసారి అని రకరకాల జబ్బులున్నాయి నాకు బెయిల్ కావాలని అడిగారు. వారానికొక కొత్త జబ్బులు అనుకుని అన్నింటికీ ఒకటే మందు బెయిల్ కావాలని అడిగాడు. ఆ రోజు బెయిల్ కోసం చంద్రబాబు విపరీతమైన పన్నాగాలు పన్నాడు. అన్ని వ్యాధులున్నాయని, బెయిల్ తీసుకుని నేరుగా ఆసుపత్రికి వెళ్లాల్సిన చంద్రబాబు.. గంటల తరబడి ఊరేగింపుగా ఇంటికి వచ్చాడు.అన్ని జబ్బులుంటే  అంతసేపు ఎలా కూర్చుకున్నాడంటే... కారణం ఆయన చెప్పిన జబ్బులన్నీ అబద్దాలే.

● ఇప్పుడు బెయిల్ రాకుండా అడ్డంకులు:

లేని లిక్కర్ కేసులో ధనంజర్ రెడ్డినో, కృష్ణమోహన్ రెడ్డినో, చెవిరెడ్డి భాస్కరరెడ్డినో, మరొకరినో అరెస్టు చేసినంత మాత్రాన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్న యుద్ధాన్ని ఒక్క క్షణం ఆపలేవు, గుర్తుపెట్టుకో చంద్రబాబూ? రాష్ట్ర ప్రజల పట్ల వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికున్న కమిట్ మెంటును ఆపడం మీ వల్ల కాదు.
బెయిల్ వస్తే విడుదల చేయడానికి మీరు చేసిన డ్రామాలు అందరూ గమనించారు. ఉదయం ఆరుగంటలకు బెయిల్ మంజూరు చేయడానికి రావాల్సిన సూపరింటెండెంట్ ను రాకుండా చాలా సేపు ఆపారు. ఈ లోగా మరలా హైకోర్టులో మోషన్ మూవ్ చేసి బెయిల్ ఆపాలని విశ్వప్రయత్నాలు చేశారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్, మాజీ ముఖ్యమంత్రి ఓఎస్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. వారు కూడా పెద్ద వయస్సులో ఉన్నవారే.. మరి ఇది అన్యాయం అని ఎందుకు మీడియాలో చర్చలు సాగడం లేదు. 

చివరిగా నేను ఒక్కటే విషయాన్ని తెలియజేస్తున్నాను. సత్యమేవజయతే... కచ్చితంగా సత్యం గెలుస్తుంది. ధర్మం నిలబడుతుంది. న్యాయం  గెలుస్తుందన్న దైర్యం మాకుందని టీ జే ఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు . వంద మద్యం కేసులు బనాయించినా... వందలాది మందిని అరెస్టు చేసినా ప్రజల కోసం వైయస్ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయకత్వంలో వైయ‌స్ఆర్‌సీపీ  పోరాటం ఆగదన్న విషయం గుర్తుంచుకోవాలని చంద్రబాబుకి సవాల్ విసిరారు. 

Back to Top