అటవీ సిబ్బందిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే బుడ్డాపై  చ‌ర్య‌లేవి ప‌వ‌న్‌? 

డీసీఎం పవన్ కళ్యాణ్‌ను సూటిగా ప్ర‌శ్నించిన శ్రీ‌శైలం మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి  

నంద్యాల జిల్లా: అటవీ సిబ్బందిపై చేయి చేసుకున్న శ్రీ‌శైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో  డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మాధానం చెప్పాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, శ్రీ‌శైలం మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి  సూటిగా ప్ర‌శ్నించారు. సోమ‌వారం నంద్యాల జిల్లా ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణంలో మీడియా స‌మావేశంలో మాట్లాడిన శిల్పా..వేల పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై  సెటైర్లు విసిరారు. అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన శాఖలో పనిచేస్తున్న దళిత, గిరిజన,మైనారిటీ ఉద్యోగులపై శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి తప్ప తాగి అచ్చోచ్చిన ఆంబోతుల దాడికి దిగితే కనీసం ఆ దాడిని ఖండించిన పాపాన కూడా పవన్ కళ్యాణ్ పోలేదని మండిపడ్డారు. గత నెల శ్రీశైలం సమీపంలోని శిఖరం వద్ద అటవీ సిబ్బందిపై చేయి చేసుకున్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని శిల్పా చక్రపాణి రెడ్డి డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ వాగ్దానాలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఒక పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేని అసమర్ధత స్థితిలో ఉందన్నారు. చంద్రబాబు నాయుడు పిట్టలదొర మాటల గారెడిలా మాట్లాడుతున్నారని ప్రజలు అన్నింటిని గమనిస్తూ కూటమిని గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారని జ్యోష్యం చెప్పారు. నిరుద్యోగులకు నెలకు రూ. 3000 భృతి ఇస్తామని మాట చెప్పి మరిచారని ఎద్దేవా చేశారు.

Back to Top