రైతుల కోసం ఉద్యమం చేస్తే సహించలేకపోతున్నారు 

అన్న‌దాత పోరుపై పోలీసుల ఆంక్ష‌లు దుర్మార్గం   

తీవ్రంగా ఖండించిన వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ స‌భ్యుడు ఎంవీఎస్ నాగిరెడ్డి

తాడేప‌ల్లి: రైతుల కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఉద్యమం చేస్తే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స‌హించ‌లేక‌పోతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ స‌భ్యుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మండిప‌డ్డారు. అన్న‌దాత పోరుపై పోలీసుల ఆంక్ష‌ల‌ను ఆయ‌న తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.  ఈ మేర‌కు ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప్రజా స్వామ్యంలో శాంతి యుతంగా జరుగుతున్న అన్న దాత పోరు కార్యక్రమాన్ని ప్రభుత్వం అప్రజాస్వామికంగా పోలీస్ వ్యవస్థతో అడ్డు కునే ప్రయతనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. 
 
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం గంటల తరబడి లైన్ లో ఉంటే మనిషికి ఒక కట్ట అమ్మడం లేకపోతే ఈ రోజు అయిపోయింది మళ్ళీ యూరియా వచ్చినప్పుడు రమ్మని రైతులను తీవ్ర ఆందోళన కు గురిచేస్తున్నవాస్తవాలు చివరకు ప్రభుత్వ అనుకూల పత్రికలలోకూడా గత ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న సంగతి అందరికి తెలిసినదే..
అదే కట్టకు రూ.500, 600 రూ కైతే దొరుకుతుంది.. దీన్ని ప్రభుత్వం దృష్టిలో ఏమంటారో కానీ ప్రజల దృష్టి లో బ్లాక్ మార్కెటింగ్ అంటారు. దీన్ని అరికట్టి రైతులకు సరిపడా యూరియా వాళ్లకి అవసరమైన సమయంలో ప్రభుత్వ ధరకు అందే లా చెయ్యమని..రైతులతో కలిసి శాంతి యుతంగా ర్యాలీగా వెళ్లి ఆర్డీవో గారికి వినతి పత్రం ఇవ్వటానికి అన్నదాత పోరు కార్యక్రమం ఈ రోజు వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది.
కానీ రాష్ట్ర చరిత్ర లో లేని విధంగా రైతులు యూరియా కొనుగోలుకు ఇబ్బంది పడుతుంటే..రాష్ట్ర చరిత్ర లో లేని మరో కార్యక్రమం పోలీస్ లను అడ్డుబెట్టి నోటీస్ లు ఇవ్వడం, ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండేలా చెయ్యడం ప్రజా స్వామ్యాన్ని ఖునీ చెయ్యడమే.

రైతులు యూరియా ఉచితంగా ఇవ్వమని అడగటం లేదు.  ప్రభుత్వ ధరకు కొనుక్కుంటాం..అందుబాటులో ఉంచండి అంటున్నారు. ప్రభుత్వ ప్రకటనలకి క్షేత్ర స్థాయి పరిస్థితికి పొంతన లేక సమాధానం చెప్పలేక అసహనం తో అప్రజాస్వామిక పాలన నడుపుతున్న కూటమి ప్రభుత్వం. రాష్ట్రం లో జరుగుతున్న నిరంకుశ విధానాన్ని ప్రజా స్వామ్య వాదు లంతా గమనిస్తున్నారు.. ఒక రోజు దీనికి మూల్యం తప్పక చెల్లించు కోవలసిన వస్తుంది` అని ఎంవీఎస్ నాగిరెడ్డి హెచ్చ‌రించారు.

Back to Top