విచక్షణాధికారం చైర్మన్‌కు లేదు

మండలి చైర్మన్‌ హోదాలో కూర్చున్న వ్యక్తి తటస్థంగా ఉండాలి

కుట్రపూరితంగా రూల్‌ 71ను టీడీపీ తెరపైకి తెచ్చంది

సెలెక్ట్‌ కమిటీకి పంపించడమే ఆశ్చర్యంగా ఉంది

ఒక లెటర్ ఇచ్చి మోషన్ మూవ్‌ చేస్తామనడం ఆశ్చర్యం

మండలి స్ఫూర్తిని టీడీపీ దెబ్బతీస్తోంది

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

అసెంబ్లీ: శాసన మండలి చైర్మన్‌కు విచక్షణాధికారం ఉండదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలిలో వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించడం రూల్స్‌కు విరుద్ధమని తెలిపారు. గురువారం అసెంబ్లీలో బుగ్గన మాట్లాడారు. వికేంద్రీకరణ, సమ్మిళిత అభివృద్ధి, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులు ప్రవేశపెట్టాం.  వాస్తవానికి శాసన సభ బిల్లును ఆమోదించి బిల్లును మండలికి పంపించాం. అక్కడ చర్చించిన తరువాత మండలిలో ఆమోదించడం, లేదా తిరిగి శాసన సభకు పంపించాలి. ఇది రూల్‌..అయితే చాలా ఆశ్చర్యకరంగా రూల్ 71ను చర్చలోకి తీసుకొని వచ్చారు. ఈ నెల 20 బీఏసీలో గవర్నమెంట్‌ బిజినెస్‌ చర్చించాం. అజెండాలో కూడా ఈ రెండు బిల్స్‌ కూడా పెట్టాం. షార్ట్‌ డిక్షషన్లో రైతులు, విద్యా రంగంపై చర్చించాలని సూచించాం. రూల్స్ 71 అన్నది ఒక ప్రోవిజన్‌. ప్రత్యేకమైన పరిస్థితిలో ప్రభుత్వ పాలసీని చర్చించి అభిప్రాయం చెప్పేది రూల్‌ 71 ఉంటుంది. ఇది ఎక్కడా కూడా లేదు. ఈ మధ్య కాలంలో కౌన్సిల్‌లో పెట్టారు. మేం పాలకపక్షం తరఫున గవర్నమెంట్‌ బిజినేస్‌పై చర్చకు అనుమతించాలని కోరాం.  అంత మంది సభ్యులు రూల్‌ 71 చర్చలో పాల్గొన్నారు. సడెన్‌గా ఒక సెలెక్ట్‌ కమిటీకి రెఫర్‌ చేయాలని టీడీపీ లేఖ ఇచ్చారట..నిన్న మార్నింగ్‌ చర్చ సందర్భంగా నాతో పాటు మంత్రులు పాల్గొన్నారు. మేం అమెన్‌మెంట్స్‌ ఇస్తాం..చర్చకు సహకరించాలని కోరాం. సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని నిన్న పొద్దున నుంచి సాయంత్రం వరకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఇలా సెలెక్ట్‌ కమిటీకి రెఫర్‌ చేయాలని రూల్‌ లేదు. 21వ తేదీనే బిల్లులు మూవ్‌ చేసినప్పుడు ఈ మోషన్‌ మూవ్‌ చేయాలని లెటర్‌ ఇచ్చామని చెబుతున్నారు. క్లీయర్‌గా రూల్‌ ఉన్నా కూడా డిస్క్‌క్రిషన్‌ అంటున్నారు. సెలెక్ట్‌ కమిటీకే సిఫార్స్‌ చేసే అధికారం ఈ రూల్‌ 71కు లేదు. మోషన్‌ మూవ్‌ చేసేందుకు, పర్మింట్‌ చేసేందుకు మాత్రమే అధికారం ఉంటుంది. ఈ రూల్‌ ప్రకారం విచక్షణా ఎక్కడ ఉంటుంది. లేటర రూపంలో మోషన్‌ ఇచ్చారు. సంఖ్యాబలం ఉందని ప్రతిపక్షం ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదు. ప్రజాస్వామ్యానికి చట్టసభలు పునాది. ప్రజలు ఎన్నుకున్న వారు చట్టాన్ని సవరణ చేస్తుంది. సభ ప్రజల తరఫున ఆమోదం ఇస్తుంది.  పెద్దల సభను గౌరవిస్తాం..కానీ శాసన సభ వేరు కదా?. సలహా ఇచ్చేందుకు పెద్దల సభ ఏర్పాటు చేశారు. పెద్దల సభలో సభ్యులు ఉండేవారు ఎవరున్నారు..స్వాతంత్య్ర సమరయోధులు, సామాజిక వేత్తలు, నటులు ఉంటారు. పొలిటికల్‌ మ్యాన్‌డెట్‌ శాసన సభకు ఉంటుంది. చేసే పనిని అడ్డగించేందుకు రూల్స్‌ ఉపయోగిస్తున్నారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు చైర్మన్‌ను కలిసి రూల్‌ ప్రకారం చేయాలని కోరాం. చైర్మన్‌కు ఎదురుగా గ్యాలరీలో చంద్రబాబు 4 గంటల సేపు కూర్చున్నారు. ప్రతి రోజు వచ్చి కూర్చొంటారా? చైర్మన్‌ను ప్రభావితం చేసేందుకు నిన్న గ్యాలరీకి చంద్రబాబు వచ్చారు. యనమల రామకృష్ణుడు బయటకు వచ్చి మంత్రులు తాగి వచ్చారని ఆరోపించారు. చట్టరూపకల్పనను అడ్డగిస్తున్నారు. పీడీఎఫ్‌, బీజేపీ, ఇండిపెండెంట్‌ సభ్యులు కూడా చైర్మన్‌ తీరును తప్పు అన్నారు. కొందరు లోపల ఒక రకంగా, బయట ఒక రకంగా మాట్లాడారు. చైర్మన్‌ తానే తప్పు చేస్తున్నానని, ఈ పద్ధతే తప్పు అంటూ గ్యాలరీలో ఉన్న చంద్రబాబు వైపు చూస్తూ ..బిల్లును సెలెక్ట్‌ కమిటీకి రిఫర్‌ చేస్తున్నానని అంటున్నారు. మండలి నిర్వాహణకు రోజుకు రూ.15 లక్షలు ఖర్చు అవుతుంది. ఏడాదికి రూ.60 కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వం కౌన్సిల్‌ను పెట్టి ఇంత డబ్బులు ఖర్చు చేస్తూ సలహాలు మాత్రమే కోరుతుంది. ఇక్కడ సభ జరుగుతుంటే అక్కడ కౌన్సిల్‌లో 4 గంటల సేపు కూర్చొని ప్రభావితం చేస్తున్నారు. ప్రజలంతా కూడా ప్రతిపక్షం తీరును బాగా ఆలోచించి, ఇలాంటివి పునరావృతం కాకుండా నిర్ణయం తీసుకోవాలి. 
 

Back to Top