కరెంటు ఛార్జీలపై ప్రతిపక్షం దుష్ర్పచారం

కొత్త టారిఫ్‌ ఛార్జీలను ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది

శ్లాబుల ధరలు పెరగకపోయినా పెరిగినట్లు దుష్ప్రచారం

లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లల్లోనే ఉండటంతో కరెంట్‌ వినియోగం పెరిగింది

మార్చి, ఏప్రిల్‌ నెలల్లో బిల్లులు ఇవ్వలేదు

రూ.5 వేల కోట్ల బకాయిలు మా ప్రభుత్వమే కట్టింది

గతంలో స్టాటిక్‌ పద్ధతిని టీడీపీ తీసుకువచ్చింది

ఏపీఈఆర్‌సీ డైనమిక్‌ పద్ధతి అమల్లోకి తీసుకువచ్చాం

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

విజయవాడ: విద్యుత్‌ ఛార్జీలపై ప్రతిపక్షం దుష్ర్పచారం చేస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. విద్యుత్‌ బిల్లులపై రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. టారిఫ్‌ శ్లాబ్‌ మారడంతో కరెంటు బిల్లులు పెరిగాయని చెప్పారు. గత ప్రభుత్వ బకాయిలను మా ప్రభుత్వమే చెల్లించిందని బుగ్గన పేర్కొన్నారు. విజయవాడలో శుక్రవారం బుగ్గన మీడియాతో మాట్లాడారు.
లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఇళ్లల్లో ఉండటంతో విద్యుత్‌ వినియోగం పెరిగిందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. రెండు నెలలుగా మీటర్‌ రీడింగ్‌ తీయలేదన్నారు. ఏప్రిల్‌ నెల నుంచి కొత్త టారిఫ్‌ అమల్లోకి వచ్చిందన్నారు.కొత్త టారిఫ్ ఛార్జీలను ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. జూన్‌ 30వ తేదీ వరకు బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తే..ఈనాడు పేపర్‌ 15 వరకు అంటూ తప్పుడు ప్రచారం చేసిందన్నారు.ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కరెంటు బిల్లులపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని పేర్కొన్నారు.

వచ్చే నెల బిల్లులు తగ్గుతాయి
ఈ సారి రెండు నెలల బిల్లులు వచ్చాయని, వచ్చే నెలలో ఈ బిల్లు తగ్గుతుందన్నారు.లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలు ఆలస్యం కావడంతోనే బిల్లు ఎక్కువ వచ్చినట్లు అనిపిస్తుందన్నారు.

మేం అధికారంలోకి రాగానే..
గత ప్రభుత్వం విద్యుత్‌ బకాయిలు పెట్టిపోతే..మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ బకాయిలు చెల్లించిందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. జెన్‌కోకు టీడీపీ హాయంలో రూ.11 వేల కోట్ల బకాయిలు ఉంటే మేం అధికారంలోకి వచ్చాక రూ.7 వేల కోట్లు చెల్లించామన్నారు. 2014లో యూనిట్‌ రూ.4.33కి కొనుగోలు చేస్తే..గత ప్రభుత్వం 2019లో యూనిట్ రూ.6కు పెంచిందని, మేం అధికారంలోకి వచ్చాక రూ.5.16కు తగ్గించామన్నారు. 2019 నాటికి రూ.20 వేల కోట్ల బకాయిలు ఉంటే రూ.5 వేల కోట్ల బకాయిలను మా ప్రభుత్వం కట్టిందని గుర్తు చేశారు. 2014లో పవర్‌ పర్చేస్‌ బకాయిలు రూ.4,900 కోట్లు ఉంటే మా ప్రభుత్వమే కట్టిందని వివరించారు.

స్టాటిక్‌ పద్ధతి దేశంలో ఎక్కడా లేదు
స్టాటిక్‌ పద్ధతి దేశంలో ఎక్కడా లేదని, గత ప్రభుత్వం మన రాష్ట్రంలో అమలు చేసి ప్రజలపై భారం మోపిందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.మా ప్రభుత్వం ఏపీఈఆర్‌సీ డైనమిక్‌ పద్ధతి అమల్లోకి తీసుకువచ్చిందని చెప్పారు.టారిఫ్‌ శ్లాబ్‌ మారడంతో కరెంటు బిల్లులు పెరిగాయని, ప్రతిపక్షాల దుష్ర్పచారాన్ని ఎవరూ నమ్మొద్దని మంత్రి బుగ్గన కోరారు.
 

తాజా వీడియోలు

Back to Top