సీఎంను టార్గెట్‌ చేసుకొని తప్పుడు ప్రచారం 

ఎన్నికలు వాయిదా వేసినప్పుడు వైద్యాధికారులను సంప్రదించారా?

రాష్ట్రంలో పరిస్థితిపై కనీసం ఆరోగ్యశాఖ నుంచి వివరాలు తెప్పించుకున్నారా?

రాష్ట్రంలో కరోనాపై అంచనా వేయకుండా ఎన్నికలు వాయిదా వేస్తారా?

కరోనాపై సీఎం వైయస్‌ జగన్ ముందస్తు చర్యలకు ఆదేశించారు

కోడ్‌ కొనసాగితే కరోనాపై ప్రభావం చూపదా?

ఎన్నికల్లో మెజారిటీ సీట్లు రాకపోతే పదవులు పోతాయని తప్పుడు ప్రచారమా?

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీనే ఎక్కువ స్థానాల్లో గెలుస్తాయి

రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి తప్పుడు ప్రచారం చేస్తారా?

టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకపోతే మేం బాధ్యత వహించాలా?

జ్వరానికి పారాసిటమాల్‌ వాడతారా? లేదా?

ఈసీ కేంద్రానికి లెటర్‌ రాశారో? లేదో ఎందుకు చెప్పడం లేదు?

ఆర్థిక మంత్రిబుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

తాడేపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని టార్గెట్‌ చేస్తూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తప్పుడు ప్రచారం చేశారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం అప్రజాస్వామికమని తప్పుపట్టారు. రాష్ట్రంలో కరోనాపై అంచనా వేయకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనాపై అధికారికంగా ఈసీ సమీక్ష చేసిందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో శనివారం బుగ్గన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..మంత్రి మాటల్లోనే..

7.03.2020 నుంచి మనకు 29 మార్చి 20202లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం నోటిఫికేషన్‌ జారీ చేశారు. నామినేషన్ల స్వీకరణ, విత్‌డ్రాలు జరుగుతున్నాయి. అకస్మత్తుగా 15వ తేదీ ఎన్నికల కమిషనర్‌ ఒక నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేశారు. వాయిదా అన్నది కరోనాకు సంబంధించి కారణం తెలిపారు. మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ను ఆరువారాల పాటు కొనసాగించారు. కిషన్‌సింగ్‌ తోమన్‌ అనే ల్యాండ్‌మార్క్‌ జడ్జిమెంట్‌ ప్రకారం కోడ్‌ చేశారు. 
నిజంగా ఎన్నికల కమిషన్‌కు కోవిడ్‌ గురించి ఆలోచన ఉంటే మంచిదే. అదే రోజు ఆరోగ్యశాఖపై సీఎం సమీక్ష కూడా ఉంది. ఇది ప్రతి ఒక్కరికి అర్థమైన విషయమే. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ కారణం వల్ల వాయిదా వేస్తున్నామని అంటున్నారు. ఈ కారణంపై హెల్త్‌ డిపార్టుమెంట్‌ను సంప్రదించారా? సీఎస్‌ను సంప్రదించారా?. కమిషనర్‌ మాత్రం వివిధ హెల్త్‌ సిబ్బందితో సంప్రదింపులు జరిపామని చెప్పారు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని కానీ, తన స్నేహితులతో మాట్లాడి వాయిదా వేయడం ఏంటి? నాకు కూడా ఇంజనీర్లతో సంబంధాలు ఉన్నాయి. వాళ్లతో సంప్రదింపులు జరపడం సరికాదు కదా? ఏ డిపార్టుమెంట్‌కు సంబంధించిన అంశాలపై వారితోనే సంప్రదించాలి. 
నిజంగా కరోనా వల్లే వాయిదా వేశారనుకుంటే..ఎన్నికల కోడ్ ఆరువారాల పాటు ఎందుకు కొనసాగిస్తారు?. ఇలా చేయడంవల్ల పరిపాలన స్థంభించబడదా?. కిషన్‌ సింగ్‌ తోమర్‌ కేసు పరిశీలిస్తే..ఆయన అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ కాలపరిమితి పూర్తి అవుతుందని, సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కోర్టుకు వెళ్లారు. అప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల కమిషన్‌ వార్డు డివిజన్ల కారణంగా ఆలస్యమైందని చెప్పింది. ఆ రాష్ట్ర హైకోర్టు డిసెంబర్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. అదే కోర్టులోనే అప్పిల్‌కు వెళ్లారు. దాని సారాంశం అంతా కూడా..రాజ్యాంగాన్ని కోడ్‌ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అధికారాలను వాడుకొని సకాలంలో ఎన్నికలు నిర్వర్తించాలని సూచించింది. కిషన్‌సింగ్‌ తోమర్‌ తీర్పును ఎప్పుడు కోట్‌ చేయాలంటే..ఎన్నిలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే మీరు చర్యలు తీసుకొని ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగానే ఉంది. ఈ సమయంలో ఈ తీర్పును ఎందుకు కోట్‌ చేశారు. ముందే ఈ కోట్‌ ఎందుకు అనుసరించారు. ఏ ఉద్దేశంతో ఎన్నికలు ఆపామన్నది ప్రాముఖ్యమైంది. మీ అధికారాలకు అడ్డువస్తుంటే అప్పుడు కిషన్‌సింగ్‌ తోమర్‌ కేసు వాడాలి కానీ..ఎన్నికలు ఆపేయడానికి ఈ తీర్పును వాడుకుంటున్నారు.
15వ తేదీ చీఫ్‌ సెక్రటరీ ఎన్నికల కమిషనర్‌కు ఓ లేఖ రాశారు. కోవిడ్‌కు సంబంధించిన ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సకాలంలో ఎన్నికలు పూర్తి చేయడానికి ఏమాత్రం అడ్డంకులు ఉండవని అందులో పేర్కొన్నారు. ఆ తరువాత కూడా సమావేశం ఏర్పాటు చేయలేదు. 17వ తేదీ సీఎస్‌కు కమిషనర్‌ ఓ లేఖ రాశారు. కరోనా అన్నది ఒక పెద్ద జబ్బు కాబట్టే ఎన్నికలు వాయిదా వేశామన్నారు. నిజంగా కరోనాపై ఆలోచన ఉంటే ఎందుకు మీటింగ్‌ పెట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తుంటే అప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాం. సుప్రీం కోర్టు ఏమన్నదంటే..ఇదివరకే ఎన్నికల ప్రక్రియ వాయిదా వేశారు కాబట్టి..తరువాత ప్రక్రియపై ప్రభుత్వంతో సంప్రదించాలని, ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయాలని సూచించింది. ఎప్పుడైతే ఎన్నికలు పెడతారో 4 వారాల ముందు కోడ్‌ అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. కేవెట్‌ ఎందుకు ఫైల్ చేశారో సమాధానం చెప్పాలి.
ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ ఆ తరువాత కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. సీఎం వైయస్‌ జగన్‌ అందరికి ఆదేశాలు ఇచ్చారని, ఎన్నికలు గెలుచుకొని రావాలని చెప్పారని ఆ లేఖలో పేర్కొన్నారు. మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఉద్దేశపూర్వకంగా సీఎంను టార్గెట్‌ చేశారు. కడప జిల్లాలో వైయస్‌ఆర్‌ కుటుంబానికి పట్టు ఉంది. అత్యధిక మెజారిటీతో అక్కడ ఆ కుటుంబ సభ్యులు గెలుస్తున్నారు. ఇలాంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఎలా పుంజుకుంటుంది. ఆ రోజు 90 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సారి ఇంకా ఎక్కువ వస్తాయి. కలెక్టర్లు, ఎప్పీలపై నిందలు వేశారు. ఎవరిపై మీకు నమ్మకం ఉంది?. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి లేఖలు రాయరు. ఎన్నికల విషయంలో అధిక సీట్లు సాధించాలని చంద్రబాబు చెప్పడం లేదా?. 
మాజీ సీఎం చంద్రబాబు డోన్‌ గురించి మాట్లాడుతున్నారు. నాకు కొమ్ములు వచ్చాయో లేదో అందరికి కనిపిస్తోంది. ఆయన ఆలోచన సరిగా లేదు. బేతంచెర్ల మండలంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులుగా 32 నామినేషన్లు వేశారు. టీడీపీ 8 మంది, సీపీఎం సభ్యులు ఇద్దరు, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ఒకరు నామినేషన్‌ దాఖలు చేశారు. ఒత్తిడి చేస్తే ఇన్ని నామినేషన్లు వస్తాయా?. ప్యాపిలిలో జనసేన అభ్యర్థి కూడా నామినేషన్‌ వేశారు. టీడీపీ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డోన్‌ మున్సిపాలిటీలో టీడీపీ వదిలేసింది. కేఈ కృష్ణమూర్తి ఎన్నికలు వద్దన్నారు. 130 నామినేషన్లు వేస్తే..5 తిరస్కరించబడ్డాయి. బీజేపీ 10, సీపీఐ 7, టీడీపీ 13, వైఎస్‌ఆర్‌సీపీ 74 మంది పోటీలో ఉన్నారు. ఒత్తిడి చేస్తే ఇంత మంది వేస్తారా? టీడీపీ నేతలు చేతకాక నామినేషన్‌ వేయకపోతే నేను బాధ్యత తీసుకొని నామినేషన్లు వేయించాలా?. ఎకగ్రీవమైనట్లు ఈసీ లెటర్‌ రాశారు. టీడీపీ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. 
చంద్రబాబు 2019లో ఎన్నికల కమిషనర్‌ గోపాలకృష్ణ ద్వీవేదితో ఏం మాట్లాడారో అందరికి తెలుసు. ఎన్నికల కమిషనర్‌ ఎవరని ప్రశ్నించారు. అంత ఈజీగా వదిలిపెడతానా అని బెదిరించారు. డీజీపీని ఎలా మార్చుతారు. శ్రీకాకుళం, కడప ఎస్పీలను ఏవిధంగా మార్చుతారు. ఇప్పుడు మీరు ఎలా మార్చుతారు. ఈసీని వైయస్‌ఆర్‌సీపీ తరఫున ప్రచారం చేయమని చంద్రబాబు సూచించారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది. మీకు నచ్చితే కరెక్ట్‌..నచ్చకపోతే తప్పు. చంద్రబాబు ఏమైనా నియంతనా?. ఒకప్పుడు సీబీఐ గ్రేట్ అన్నారు. ఆయనే సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఈడీ బ్రహ్మండం అన్నారు. వద్దు అన్నారు. నేను బాధ్యత కలిగిన పౌరుడిని, బాధ్యత కలిగిన పార్టీ అధినేతను, నేను కూడా వదిలేస్తే..దేశం ఎలా పోతుంది?. ఎం చెప్పాలనుకుంటున్నారో ..ఆశ్చర్యంగా ఉంది.
కరోనా విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశాం. కార్వైంటన్‌ వెంటిలేటర్స్‌ను గుర్తించాం. స్కూళ్లకు సెలవులు ఇచ్చాం. టెంపుల్స్‌ను నియంత్రించాం. పారాసెటమల్‌ అంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. జ్వరానికి పారాసెటమల్‌ వాడమా?. మీడియా పవర్‌ ఉందని ప్రభుత్వాన్ని భద్నాం చేస్తున్నారు. అర్ధగంట సేపు సీఎం మాట్లాడితే ఒక్క పారాసెటమల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ మాత్రమే ప్రచారం చేస్తారా? మిగతాది ఎందుకు చూపించరు.  ఎన్నికల కమిషనర్‌ను కోరుతున్నాం...సారూ..మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. మీకు విశేష అధికారాలు ఉన్నాయి.మన బాధ్యతలు నిర్వర్తించడానికి అధికారం ఇస్తారు. సుప్రీం కోర్టు ఎన్నికల వాయిదా విషయంలో రాజకీయ కోణం ఉందని గుర్తించింది. నోటిఫికేషన్‌ విడుదల చేశారు కాబట్టి మేం జోక్యం చేసుకోలేకపోతున్నామని చెప్పింది. తరువాత మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని, ఎన్నికల తేదీలు ఖరారు చేసే సమయంలో రాష్ట్రాన్ని సంప్రదించాలని సూచించింది. సుప్రీం కోర్టు  ఆదేశాలను రాష్ట్రంలో అమలు పరచాలని ఎన్నికల కమిషనర్‌ను మంత్రి బుగ్గన కోరారు.
ఎన్నికల కమిషనర్‌ కేంద్రానికి లేఖ రాశారు. మూడు రోజుల పాటు ఆయన లేఖపై స్పందించలేదు. భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు సంప్రదించలేదు. లెటర్ రాశారో? లేదో చెప్పడం లేదు. ఇందులో ఆంతర్యమేంటి?. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ వద్దని ప్రభుత్వం చెబుతోంది. టీడీపీ కోరిక ఏంటో చెప్పాలి. వైయస్‌ జగన్‌ సీఎం అయిన వెంటనే కలెక్టర్ల సమావేశంలో పార్టీలకు అతీతంగా పాలన సాగించాలని ఆదేశించారు. కానీ చంద్రబాబు ఏం చెప్పారో చూశాం. నాకు పార్టీ ముఖ్యమని కలెక్టర్లకు చెప్పారు. ఇంతకంటే ఏం చెప్పాలని ప్రశ్నించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top