‘అనంత’ను స్మార్ట్‌ సిటీగా మారుస్తాం

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

అనంతపురం: అనంతపురం నగరాన్ని స్మార్ట్‌ సిటీగా మారుస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అనంతపురం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ రెండో రోజు పర్యటించారు. అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డితో కలిసి నగరంలో విస్తృతంగా పర్యటించారు. బిందెలకాలనీ, ఎస్సీ కాలనీ, గుత్తి రోడ్డు ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారాయణపురం పంచాయతీలో డంపింగ్‌ యార్డు స్థలాన్ని పరిశీలించారు. అలాగే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. అనంతపురంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ మంజూరు చేస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

 

Read Also: సహజ వనరులే ఏపీ సంపద

తాజా ఫోటోలు

Back to Top