ప్రజాబలంతో ముందుకు వెళ్తాం

మండలి చైర్మన్‌ నిర్ణయం దురదృష్టకరం, అప్రజాస్వామ్యం

5 కోట్ల ప్రజలు సీఎం వైయస్‌ జగన్‌కు అధికారం ఇచ్చారు

చంద్రబాబు డైరెక్షన్‌లోనే మండలి చైర్మన్‌ నడుచుకున్నారు

సంఖ్యాబలం ఉందని టీడీపీ అడ్డగోలుగా వ్యవహరించింది

ఇదేనా 40 ఏళ్ల చంద్రబాబు రాజనీతి?

బీజేపీ, పీడీఎఫ్‌ సభ్యులు కూడా నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు

అనర్హులకు చంద్రబాబు ఇలాంటి పదవులు ఇచ్చారు

లోకేష్‌ నాపైకి దూసుకువచ్చాడు

రాష్ట్రంలో అలజడులు, అల్లకలోలం సృష్టించాలన్నదే చంద్రబాబు ఆలోచన

మంత్రి బొత్స సత్యానారాయణ

అసెంబ్లీ: మా నాయకులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆలోచన విధానంతో ప్రజాబలంతో ముందుకు వెళ్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. నిన్న శాసన మండలిలో జరగిన పరిణామాలు దురదృష్టకరం, అనైతికమని ఆయన తీవ్రంగా ఖండించారు. గురువారం మీడియా పాయింట్‌లో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. 
నిన్న శాసన మండలిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అప్రజాస్వామ్యం. శాసన మండలి చరిత్రలోనే అది దుర్దినం.ప్రజాభిప్రాయంతో, ఐదు కోట్ల ప్రజల ఆమోదంతో ఏర్పాటు అయిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. మా అందరి అభివృద్ధి సీఎం వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని తీర్పు ఇచ్చారు. అన్ని జిల్లాల సమాన అభివృద్ధి కోసం వికేంద్రీకరణ బిల్లుకు శాసన సభలో సంపూర్ణ ఆమోదం తెలిపి శాసన మండలికి పంపిస్తే..కౌన్సిల్లో అధికార పక్షం పంపించిన బిల్లును ప్రతిపక్షం నిబంధనలకు విరుద్ధంగా, అడ్డగోలుగా, సంఖ్యాబలం ఉందని బిల్లును చైర్మన్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపించారు. బీజేపీ, పీడీఎఫ్‌, ఇండిపెండెంట్లు అందరూ కూడా ఒకే మాట చెప్పారు. చైర్మన్‌ నిబంధనల ప్రకారం నడవాలి. విచక్షణాధికారంతో నిర్ణయాలు తీసుకోవద్దని అన్ని పక్షాలు చెప్పినా కూడా చైర్మన్‌ తన పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు చేసి కౌన్సిల్‌కు మచ్చ తెచ్చారు. సంప్రదాయాలు పాటిస్తున్న మండలి చైర్మన్‌ ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారని నమ్మాం.తీరా ఆ చైర్మన్‌ తీసుకున్న నిర్ణయం చూస్తే..చట్టానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం..పార్టీ విధానాన్ని కౌన్సిల్లో అమలు చేశారు. చైర్మన్‌ నిర్ణయం చాలా బాధనిపించింది. ఎంతో మంది చైర్మన్లను చూశాను. మంత్రిగా పని చేశాను. ఎక్కడైనా చట్టాలు చేసే సమయంలో రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి నిర్ణయం తీసుకోవాలి. ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా అలాంటి ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు వ్యవహరించడం ఎంత వరకు సమంజసం. ఈ సమాజానికి ఏ సందేశం ఇస్తున్నాం. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు అర్హత లేని వారిని అలాంటి పదవుల్లో కూర్చోబెట్టడం ఎంత వరకు సమంజసం. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తాగి వచ్చి మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇదేనా మీ అనుభవం?. చైర్మన్‌ను ఇది సరికాదని నేను చెబితే..మొదటిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన నారా లోకేష్‌ నాపైకి దురుసుగా వచ్చారు. వాళ్లు ఏమన్నా కూడా చూస్తు ఉండాలా?. నిన్నటి పరిణామాలు దురదృష్టకరం. చంద్రబాబు మండలి గ్యాలరీలో కూర్చోని సెల్‌ఫోన్‌లో సూచనలు ఇస్తూ అక్కడే ఉంటూ చైర్మన్‌ను ప్రభావితం చేశారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. గత ఐదేళ్లు రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నావో అందరికి తెలుసు. కోట్లాది రూపాయలు అప్పులు చేసి అవినీతికి పాల్పడ్డారు. ఇంకా దోపిడీ కొనసాగాలని కోరుకుంటున్నారా?. శాసన మండలిలోకి సెల్‌ఫోన్‌ ఎలా అనుమతిస్తారు. మా నాయకుడి విధానాలను కొనసాగిస్తాం. ప్రజాబలంతో ముందుకు వెళ్తాం. రాజ్యాంగబద్ధంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తున్నాం. నిన్నటి పరిణామాలను ఎల్లోమీడియా వక్రీకరించింది కథనాలు రాసింది. చైర్మన్‌ తానే తప్పు చేశానని చెప్పినా కూడా ఆ పత్రికలు రాయలేదు. 
 

Back to Top