టెక్కలి : టెక్కలి నియోజకవర్గంలో నిర్వహించిన వైయస్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి మండలంలో నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకత్వం, కార్యకర్తల మధ్య సమన్వయం మరింత పెంచుకోవాలని, ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని ధర్మాన ప్రసాదరావు సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. సమావేశంలో నియోజకవర్గానికి చెందిన వైయస్ఆర్‌సీపీ నాయకులు, మండల స్థాయి నేతలు, కార్యకర్తలు పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.