పార్టీ పదవులకు వన్నె తెచ్చేలా ప్రతి కార్యకర్త పనిచేయాలి

 కోవెలకుంట్ల మండల స్థాయి వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల సమావేశంలో కాటసాని రామిరెడ్డి

నంద్యాల జిల్లా : కోవెలకుంట్ల పట్టణంలోని వీఆర్‌ఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో కోవెలకుంట్ల మండల స్థాయి వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ పదవులు కేవలం అలంకారప్రాయంగా కాకుండా, వాటికి వన్నెతెచ్చే విధంగా ప్రతి కార్యకర్త బాధ్యతతో పనిచేయాలని కాటసాని రామిరెడ్డి సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు భూమా కిషోర్ కుమార్ రెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు కర్రా హర్షవర్ధన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కర్రా గిరిజా హర్షవర్ధన్ రెడ్డి, కోవెలకుంట్ల మండల వైయ‌స్ఆర్‌సీపీ కన్వీనర్ బీవీ నాగార్జున రెడ్డితో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల పరిషత్ అధ్యక్షురాలు భీమిరెడ్డి రమాదేవి, వైస్ ఎంపీపీ షాజహాన్ బేగం, సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, కానాల రవిరెడ్డి, భీమిరెడ్డి ప్రతాప్ రెడ్డి, లక్కిరెడ్డి సుధాకర్ రెడ్డి, కలుగొట్ల రాంభూపాల్ రెడ్డి, అందె శ్రీనివాస రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Back to Top