దేశ భవిష్యత్తును నిర్మించేది ఇంజనీర్లే 

 ఇంజనీర్లందరికీ వైయ‌స్ జగన్ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు

తాడేప‌ల్లి: ఇంజనీరింగ్ అంటే కేవలం భవనాలు, రహదారులు, వంతెనలు నిర్మించడం మాత్రమే కాదని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ దేశ భవిష్యత్తును నిర్మించడమని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇంజనీర్స్ డే సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ ప్రత్యేకంగా స్పందించారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అసాధారణ ప్రతిభను స్ఫూర్తిగా పేర్కొంటూ, దేశ ప్రగతిలో ఇంజనీర్ల కీలక పాత్రను గుర్తు చేశారు. ఇంజనీరింగ్ రంగం అభివృద్ధి, ఆవిష్కరణలకే పరిమితం కాకుండా సమాజ పురోగతికి, ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు కీలకంగా నిలుస్తోందని తెలిపారు.

“ఇంజనీరింగ్ అంటే కేవలం నిర్మాణాలు కాదు.. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ దేశ భవిష్యత్తును నిర్మించడం” అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇలాంటి అసాధారణ ప్రతిభతో భారతదేశ అభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని కొనియాడారు.

దేశ మౌలిక వసతుల అభివృద్ధి నుంచి ఆధునిక సాంకేతికత వరకు ఇంజనీర్ల సేవలు ఎంతో కీలకమని వైయ‌స్ జగన్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో భాగస్వాములవుతున్న ప్రతి ఇంజనీర్‌కు ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

Back to Top