వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మేనత్త కన్నుమూత

అమెరికాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస

ఆమె మృతిపై వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి

పులివెందుల(వైయ‌స్‌ఆర్ కడప జిల్లా): దివంగత సీఎం డాక్టర్‌ వైయ‌స్‌ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మేనత్త, వైయ‌స్‌ రాజారెడ్డి సోదరి వైయ‌స్‌ కమలమ్మ (88) ఆదివారం కన్ను మూశారు. కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతు­న్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమెను పులివెందులలో మాజీ సీఎం వైయ‌స్‌ జ‌గ‌న్ దంపతులు పరామర్శించారు.

కమలమ్మ మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లి అక్కడే ఆమె కుమార్తె మెర్సీ వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం అక్కడే ప్రాణాలు విడిచారు. కమలమ్మ భౌతికకాయాన్ని పులివెందులకు తీసుకొచ్చి వైయ‌స్‌ఆర్ సమాధుల తోటలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కమలమ్మ మృతిపై మాజీ సీఎం వైయ‌స్‌ జ‌గ‌న్ దంపతులతో పాటు, వైయ‌స్‌ఆర్ సతీమణి వైయ‌స్‌ విజయమ్మ, కడప ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌ రెడ్డి, వైయ‌స్‌ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 

Back to Top