విఘ్నేశ్వరుడి కృప ప్రజలందరిపై ఉండాలి

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

 
తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, విజయాలను ప్రసాదించే సిద్ధివినాయకుడి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ పవిత్ర పర్వదినాన్ని రాష్ట్ర ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని వైఎస్‌ జగన్‌ కోరుకున్నారు. ఈ మేరకు ఈ ఉదయం ఎక్స్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేశారాయన.
 

Back to Top