తాడేపల్లి: వినాయకచవితి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ క్షేమం, స్థైర్యం, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని ఆయన ఆకాంక్షించారు. ఏ కార్యం తలపెట్టినా మహాగణనాథుడిని ముందుగా పూజించడం మన సంప్రదాయమని శ్రీ వైయస్ జగన్ గుర్తు చేశారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు ఎదురయ్యే విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు. ఈ వినాయకచవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు సిద్ధించాలని శ్రీ వైయస్ జగన్ ఆకాంక్షించారు. గణనాథుని కరుణాకటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందాలని అభిలషించారు. వినాయకచవితి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నింపాలని, రాష్ట్రం సుభిక్షంగా, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని శ్రీ వైయస్ జగన్ ఆకాంక్షించారు.