నారా లోకేష్ కు ఇంకా అంత ప‌రిజ్ఞానం రాలేదు

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

విజ‌య‌వాడ‌: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ క‌నీస ప‌రిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నార‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు. భారీ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల ఇళ్లు నీట మునిగాయని, 14 మంది ప్రాణాలు కోల్పోయారని, దీనికి కారణం ప్రభుత్వ అలసత్వమే అన్న టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోప‌ణ‌ల‌ను బొత్స స‌త్య‌నారాయ‌ణ తీవ్రంగా ఖండించారు.  నారా లోకేశ్ కు ఇంకా అంత పరిజ్ఞానం రాలేదని బొత్స ఎద్దేవా చేశారు. వర్షాలు తగ్గకుండానే నష్టాన్ని ఎలా అంచనా వేస్తారని ప్రశ్నించారు. ఆయనకు తెలియకపోతే ఆయన తండ్రి చంద్రబాబును అడిగి తెలుసుకోవాలని అన్నారు. వర్షాలు తగ్గిన తర్వాత నష్టాన్ని అంచనా వేసి, తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top