తాడేపల్లి: చంద్రబాబు ప్రజా వ్యతిరేకి అని వైయస్‌ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయ ఆవరణలో ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజలు కోరుకున్నదే నెరవేరుతుంది. న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది. విశాఖకు పరిపాలన రాజధాని వస్తుంది. రఘురామ కృష్ణంరాజు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం. స్పీకర్ చర్యలు తీసుకుంటారనే విశ్వాసం ఉంది’ అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఉత్తరాంధ్రే: మంత్రి అవంతి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఉత్తరాంధ్రేనని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలిసిపోయిందన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ఊహల్లోంచి బయటకు రావాలన్నారు. బాబు అధికారంలో ఉండగా విశాఖలో ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లకే రూ.23 కోట్లు చెల్లించారని గుర్తుచేశారు. 30 ఎకరాల్లో ప్రభుత్వ గెస్ట్ హౌస్ కట్టేందుకు చంద్రబాబు అడ్డుపడుతున్నారని, రాజధాని బిల్డింగ్‌లకు మాత్రం 30 వేల ఎకరాలు సేకరించారని మండిపడ్డారు.