స్వీయ నియంత్రణ, భౌతికదూరం కచ్చితంగా పాటించాలి

ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌

నెల్లూరు: కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. కరోనా టెస్టింగ్‌ కోసం కిట్లను కూడా సిద్ధం చేస్తున్నామని, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. ప్రజలు స్వీయ నియంత్రణ, భౌతికదూరం కచ్చితంగా పాటించాలని సూచించారు.

తాజా వీడియోలు

Back to Top