సీఎం వైయస్‌ జగన్‌ రైతు పక్షపాతి

పారదర్శక పాలనే  ప్రభుత్వ లక్ష్యం 

ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం

ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

అమరావతి: వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో పనిచేస్తుందని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ సాగునీటì  ప్రాజెక్టులను ఆపేస్తున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యలను తప్పబట్టారు.సాగునీటి ప్రాజెక్టులు ఆపేస్తున్నామని ఎవరు చెప్పారని ప్రశ్నించారు.సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి నిపుణుల కమిటీ వేస్తామని..పారదర్శకంగా..అవినీతి రహితంగా చేపడతామని తెలిపారు.జుడీషియల్‌ కింద టెండరింగ్‌  విధానం తీసుకురావడం జరుగుతుందన్నారు.మొదలు కాని,,టెండరింగ్‌లో ఉన్న పనులు,25 శాతం జరిగిన పనులపై విచారణ చేపడతామని  సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా చెప్పారని తెలిపారు.ప్రజాధనం వృధా కాకుండా చూడాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన అని పేర్కొన్నారు. చంద్రబాబు భయంతో ఎక్కడ తన అవినీతి బయటపడుతుందోనని ఉలిక్కి పడుతున్నారని తెలిపారు.అభివృద్ధి కుంటుపడుతుందంటూ చంద్రబాబు అనవసర  రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు.వైయస్‌ జగన్‌ పాలనలో ఏపీని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. పోలవరం,రాజధాని నిర్మాణ పనుల్లో భారీస్థాయిలో అవినీతి  జరిగిందని, దీనిపై కమిటీలు వేస్తున్నామని తెలిపారు.చంద్రబాబు,టీడీపీ నేతలు తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా బయటపడతాయన్నారు.దివంగత మహానేత వైయస్‌ఆర్‌ మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులను ఆయన తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లలో పూర్తిచేయడం జరుగుతుందని తెలిపారు.వైయస్‌ఆర్‌సీపీ రైతు పక్షపాత ప్రభుత్వమని తెలిపారు.దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసే విధంగా వైయస్‌ జగన్‌ పరిపాలన చేస్తారన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top