కాపులను సర్వనాశనం చేయడమే టీడీపీ లక్ష్యం

మంత్రి అంబటి రాంబాబు

కాపులను హింసించడమే టీడీపీ పని 

టీడీపీ ప్రభుత్వంలో కాపులపై అనేక కేసులు నమోదు చేశారు

కేసు కొట్టివేయడం చంద్రబాబు, రామోజీ భరించలేకపోతున్నారు

కాపుల విషయంలో చంద్రబాబు సైకోలా వ్యవహరించారు

పవన్‌ కళ్యాణ్‌ ఒక అజ్ఞాని

పవన్‌ చంద్రబాబుతో కలిసినా కాపులు కలవరు

తాడేపల్లి: కాపులను సర్వనాశనం చేయడమే టీడీపీ లక్ష్యమని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తుని రైలు దగ్ధం కేసును కోర్టు కొట్టివేయడం పట్ల చంద్రబాబు, రామోజీరావు తట్టుకోలేకపోతున్నారని మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు ప్రోద్భలంతోనే వంగవీటి రంగా హత్య జరిగిందని గుర్తు చేశారు. కాపులను హింసించడమే టీడీపీ పని అన్నారు. కాపులపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన 69 అక్రమ కేసులను వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కేవలం ఒకే ఒక జీవోతో ఎత్తివేశారని తెలిపారు. పవన్‌ చంద్రబాబుతో కలిసినా కాపులు కలవరన్నారు. పవన్‌ వైఖరి పట్ల కాపులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి అంబటి రాంబాబు సూచించారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. 

మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారంటే..

 • టీడీపీ ప్రభుత్వంలో కాపులపై అనేక కేసులు నమోదు చేశారు
 • టీడీపీ హయాంలో కాపులను హింసించారు
 • చంద్రబాబు ప్రోద్భలంతోనే వంగవీటి మోహన రంగా హత్య
 • తుని ఘటనపై నమోదు అయిన కేసులు కొట్టి వేయడంతో చంద్రబాబు, రామోజీరావులు భరించలేకపోతున్నారు.
 • కాపులపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసులను వైయస్‌జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఒక జీవోతో రద్దు చేశారు.
 •  టీడీపీపై కేసులు పెట్టడం, ఆతరువాత వచ్చిన ప్రభుత్వం కేసులను విత్‌డ్రా చేసుకోవడం గమనిస్తే..టీడీపీ అధికారంలో ఉంటే కాపులను హింసిస్తారు. 
 • రాజకీయ కక్షతోనే తుని ఘటనలో కాపులపై చంద్రబాబు 69 కేసులు పెట్టించారు.
 • కాపు జాతిని సర్వనాశనం చేసేందుకు టీడీపీ కంకణం కట్టుకుంది. 
 • టీడీపీ ఎప్పుడూ కూడా కాపు వ్యతిరేక పార్టీ
 • ఈనాడు రామోజీరావు ఏడుస్తూ కాపులపై వార్తలు రాస్తున్నాడు
 • చరిత్ర తెలియని కొందరు పెద్దలు ఇవాళ చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలని బయలుదేరారు.
 • చంద్రబాబు కాపులపాలిట సైకోలాగా వ్యవహరించారు. ముద్రగడ కుటుంబాన్ని హింసించారు.
 • పవన్‌కు చరిత్రే తెలియదు. ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో తెలియదు. మోహన రంగాను హత్య ఎప్పుడు చేశారో ఆయనకు తెలియదు
 • ముద్రగడ కాపులను బీసీల్లో చేర్చాలని ఉద్యమించింది పవన్‌కు తెలియదు. ఆ సమయంలో పవన్‌ ఇంట్లో పడుకున్నాడు.
 • కాపులంతా కలిసి చంద్రబాబుకు మద్దతు తెలపాలని పవన్‌ అంటున్నాడు.
 • కాపులతో చంద్రబాబు పల్లవి మోపించాలని పవన్‌ ఆలోచన చేస్తున్నారు.
 • పవన్‌ ఎంత అజ్ఞానో ఆలోచించండి. వంగవీటి మోహన రంగా చనిపోయిన తరువాత ఆయనకు గ్లాస్‌లో టీ తాగించాలనుకుంటున్నాడు.
 • టీ, కాఫీలు అలవాటు లేని వంగవీటి మోహన రంగాకు ఆయన మరణించాక గ్లాస్‌లో టీ తాగించాలని ప్రయత్నం చేస్తున్నాడు.
 • ఇవాళ రాజకీయాలు గమనిస్తే..చంద్రబాబు పవన్‌ వద్దకు వెళ్తాడు. పవన్‌ చంద్రబాబు వద్దకు వెళ్తున్నాడు. ఎందుకీ దాగుడు మూతలు. ఇద్దరు కలిసి పోటీ చేయండి.
 • మీరు కలిస్తే కలుస్తారేమో కానీ, ఇంతటి హింసకు గురైన కాపులు మాత్రం చంద్రబాబుతో కలవరు.
 • ఈ విషయం ఇవాళ కాకపోతే రేపైనా మీకు తెలుస్తుంది.
 • టీడీపీ పుట్టినప్పటి నుంచి నేటి వరకు ఈ రాష్ట్రంలో కాపులను అణచివేసిన చరిత్ర టీడీపీ ప్రభుత్వానిది. ఆ పార్టీ కాపుల శ్రేయస్సు కోరదు.
 • ప్యాకేజీ కొట్టేసి, డబ్బులు కొట్టేసి, సినిమా అమ్మేసినట్లుగా కాపులను చంద్రబాబుకు అమ్మాలని ప్రయత్నం చేసే పవన్‌ను కాపులు కనిపెట్టి ఉండాలి.  
 • కేసు కొట్టేస్తేనే ఇంత కంగారుపడిపోతున్నారు. ఇంత ఆవేదన పడుతున్నారు.
 • దోషులు కానివారిని చంద్రబాబు దోషులుగా చిత్రీకరించాలని చూస్తే..కోర్టుల్లో వాటిని ఫ్రూవ్‌ చేయలేకపోవడంతో కొట్టేశాయి. ఇలాంటి సందర్భంలో హర్షించాలి కానీ జాతి వైరంతో మమ్మల్ని ఏదో ఒక విధంగా తొక్కేయాలని కుట్రలు చేస్తున్నారు.
 • ఓ పార్టీలో ఉండి వేరే పార్టీవారితో కలవడం పవన్‌కు అలవాటే
 • తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కొద్ది కామెడీగా మాట్లాడుతారు. పోలవరం నిర్మాణం జరిగితే భద్రాచలం మునిగిపోతుందని ఆ రాష్ట్ర మంత్రే అన్నాడు.
 • ఇవాళ పోలవరం మేమే నిర్మిస్తామని మల్లారెడ్డి కామెడీ చేస్తున్నారు.
 • పోలవరం వైయస్‌ రాజశేఖరరెడ్డి కల. సీఎం వైయస్‌ జగన్‌ దాన్ని సాకారం చేస్తారు. కేసీఆర్, మల్లారెడ్డిలు కట్టాల్సిన అవసరం లేదు. 
 • కేసీఆర్, మల్లారెడ్డిలు నీటి వాటా వద్ద తగాద పడకుండా, మా నీళ్లు మాకిప్పిస్తే చాలు.

 

Back to Top